Magunta Sreenivasulu Reddy: ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి పోటీపై మరోసారి ప్రతిష్టంభన.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Magunta Sreenivasulu Reddy: ప్రకాశం జిల్లా వైసీపీ రాజకీయాల్లో కన్ఫ్యూజన్ కొనసాగుతోంది. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి పోటీపై మరోసారి ప్రతిష్టంభన నెలకొంది. మాగుంట పోటీపై స్పష్టత ఇవ్వలేమని వైసీపీ అధిష్టానం చెబుతోంది. మంగళవారం మాగుంట శ్రీనివాసులు రెడ్డి, బాలినేని శ్రీనివాస రెడ్డితో ఐ ప్యాక్ ప్రతినిధులు భేటీ అయ్యారు. అయినా మాగుంట పోటీపై అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి నియోజకవర్గాల అభ్యర్థుల ఎంపిక కసరత్తు కూడా కొలిక్కిరాలేదు. సీఎం జగన్‌ను కలిసేందుకు వచ్చి గత మూడు రోజులుగా బాలినేని శ్రీనివాస రెడ్డి విజయవాడలోనే ఉన్నారు. విజయవాడలో గత మూడు రోజులుగా మాజీమంత్రి బాలినేనితో జిల్లా లోని పలు నియోజవర్గాల వైసీపీ నేతలతో సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
Read Also: Buddha Venkanna Counter: కేశినేని నానిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ బుద్దా వెంకన్న
Also Read
- INDIA Bloc: రాహుల్ నిరసనకు అఖిలేష్ దూరం.. కాంగ్రెస్-SP మధ్య గ్యాప్?
- Maharashtra: మహా ఘోరం.. పెట్రోల్ బంక్ సీజ్ చేయడానికి వెళ్లిన అధికారి హత్య
- PM Modi: ‘‘మోడీని దించేందుకు ప్రయత్నిస్తున్నారు’’.. సెర్బియా మాజీ అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు
- UNO-AP: ఏపీ ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు ముందుకొచ్చిన ఐక్యరాజ్యసమితి..
మూడు రోజులుగా సీఎం జగన్‌ను కలిసేందుకు బాలినేని ప్రయత్నిస్తున్నారు. ఒంగోలులో 25 వేల మంది పేదలకు ఇళ్ళ స్థలాల కోసం కొనుగోలు చేసిన భూములకు గత కొన్ని నెలలుగా నగదు వేయాలని బాలినేని శ్రీనివాస రెడ్డి కోరుతున్నారు. పలుసార్లు ఇదే విషయమై సీఎం జగన్ సహా ఆయన వ్యక్తిగత కార్యదర్శి ధనుంజయరెడ్డిని బాలినేని కోరారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తేనే ఒంగోలు నుంచి పోటీ చేస్తానని బాలినేని స్పష్టం చేశారు. భూములకు నగదు విషయంతో పాటు పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి చేయాలని ఎంపీ విజయసాయిరెడ్డితో పలుసార్లు భేటీ అయ్యారు. పలు విషయాల్లో స్పష్టత వచ్చాకే సీఎం జగన్‌తో కలుస్తానని విజయసాయిరెడ్డికి బాలినేని చెప్పారు. ప్రతిష్టంభన కొనసాగుతుండటంతో సీఎం జగన్‌ను కలవకుండానే బాలినేని శ్రీనివాసరెడ్డి హైదరాబాద్ బయలుదేరారు.
తాజావార్తలు
-
INDIA Bloc: రాహుల్ నిరసనకు అఖిలేష్ దూరం.. కాంగ్రెస్-SP మధ్య గ్యాప్?
-
పండుగ పూట EMIల మోత.. హోమ్ లోన్ తీసుకున్నవారిపై భారం ఎంతంటే!
-
Maharashtra: మహా ఘోరం.. పెట్రోల్ బంక్ సీజ్ చేయడానికి వెళ్లిన అధికారి హత్య
-
Zodiac Signs : రాహు-కేతువుల నక్షత్ర సంచారం.. ఈ 4 రాశుల జాతకులకు అదృష్ట యోగం
-
PM Modi: ‘‘మోడీని దించేందుకు ప్రయత్నిస్తున్నారు’’.. సెర్బియా మాజీ అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!