రూ.2000 నోట్లు రద్దు అనంతరం.. రిజర్వ్ బ్యాంక్ రూ.500 నోటును నిషేధించబోతోందా? దీనికి సంబంధించిన చర్చ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వాట్సాప్‌లో ఒక మెసేజ్‌ను ఎక్కువగా షేర్ చేయబడుతోంది. ఏటీఎంలలో రూ.500 నోట్లను క్రమంగా ఉంచడం ఆపాలని బ్యాంకులను రిజర్వ్ బ్యాంక్ ఆదేశించించినట్లు అందులో ఉంది. మార్చి 2026 నాటికి రూ.500 నోట్లు ఏటీఎంలలో ఉంచడం ఆగిపోతుందని ఆ సందేశంలో పేర్కొన్నారు.
READ MORE: Helmets: అమెజాన్-ఫ్లిప్‌కార్ట్ సేల్.. ఈ కంపెనీ క్వాలిటీ హెల్మెట్లపై భారీ డిస్కౌంట్..
“సెప్టెంబర్ 30, 2025 నాటికి ఏటీఎంలో రూ.500 నోట్లు పెట్టడం ఆపాలని రిజర్వ్ బ్యాంక్ అన్ని బ్యాంకులను కోరింది. మార్చి 31, 2026 నాటికి 75% బ్యాంకులు 90% ఏటీఎంల నుంచి రూ.500 నోట్లను నిలిపివేయడమే లక్ష్యం. భవిష్యత్తులో, ఏటీఎంల నుంచి రూ.200, రూ.100 నోట్లు మాత్రమే బయటకు వస్తాయి. కాబట్టి ఇప్పటి నుంచి మీ వద్ద ఉన్న రూ.500 నోట్లను ఖర్చు చేయడం ప్రారంభించండి.” అని ఆ మెసేజ్‌లో రాసుకొచ్చారు.
READ MORE: Delhi: ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థిని స్నేహ అదృశ్యం.. రంగంలోకి పోలీసులు
పీఐబీ ఫ్యాక్ట్ చెక్ ప్రకారం, ఈ పుకార్లలో ఎలాంటి నిజం లేదు. ఆర్బీఐ రూ. 500 కరెన్సీ నోట్లను రద్దు చేయడానికి సంబంధించి ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ నోట్లు చట్టబద్ధమైన చెల్లుబాటును కలిగి ఉన్నాయి. ఇంకా దేశవ్యాప్తంగా ఇప్పటికీ జారీ చేస్తోంది. లావాదేవీలు జరుగుతున్నాయి. ఈ వీడియో తప్పుదోవ పట్టించేది ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఆర్బీఐ కూడా సర్క్యులర్ ఏం విడుదల చేయలేదు.
READ MORE: Khalistani Terrorists: ఇండియా మోస్ట్ వాంటెడ్, 8 మంది ఖలిస్తానీ ఉగ్రవాదుల అరెస్ట్..
గతంలో, నవంబర్ 2016లో అప్పటి పెద్ద నోట్లు.. రూ. 500, రూ. 1000 కరెన్సీ నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ సంచలన ప్రకటన చేశారు. ఆ తర్వాత, 2023 మే నెలలో, RBI రూ. 2000 నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది, అయితే అవి చట్టబద్ధమైన టెండర్‌గా కొనసాగుతాయి అని తెలిపింది. ఈ నేపథ్యంలోనే రూ. 500 నోట్ల రద్దు గురించి వస్తున్న పుకార్లు ప్రజల్లో మరింత ఆందోళన కలిగించాయి.