IPL 2024: కేకేఆర్‌లోకి గౌతమ్ గంభీర్..! షారుక్ తో భేటీ అందుకే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 24వ సీజన్‌కు ముందు కోల్‌కతా నైట్ రైడర్స్‌లో భారీ మార్పులు చోటుచేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. గౌతమ్ గంభీర్ రీ ఎంట్రీపై చర్చలు కూడా జరుగుతున్నాయి. గౌతమ్ గంభీర్ కోల్‌కతా నైట్ రైడర్స్‌కు తిరిగి రావచ్చని కెప్టెన్ నితీష్ రానా కూడా సూచించాడు. అయితే గౌతమ్ గంభీర్ కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) యజమాని షారుక్ ఖాన్‌ను కూడా కలిశాడు. వీరిద్దరి భేటీకి సంబంధించిన ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Padma Hilsa: దుర్గా నవరాత్రి ఉత్సవాలకు బంగ్లాదేశ్ గిఫ్ట్.. “పద్మా పులస” చేపల ఎగుమతికి ఓకే..
Also Read
ఇంతకుముందు గౌతమ్ గంభీర్ కోల్‌కతా నైట్ రైడర్స్‌లో కీలక పాత్ర పోషించాడు. గంభీర్ 2011 నుండి 2017 వరకు KKR కెప్టెన్‌గా ఉన్నాడు. అయితే అతని కెప్టెన్సీలోనే 2012, 2014లో కేకేఆర్ ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకుంది. అంతేకాకుండా.. గంభీర్ కెప్టెన్సీలోనే కోల్ కతా ఐదు సార్లు ప్లే ఆఫ్స్‌కు చేరుకోగలిగింది. ప్రస్తుతం గౌతమ్ గంభీర్.. ఐపీఎల్లో లక్నో సూపర్ జెయింట్స్ తో మెంటార్ గా కొనసాగుతున్నాడు. జస్టిన్ లాంగర్‌ను ప్రధాన కోచ్‌గా నియమించినప్పటి నుండి గంభీర్ లక్నోతో విడిపోయే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. ఇప్పుడు షారుక్, గంభీర్ల భేటీతో ఈ అనుమానాలు నిజమయ్యేలా కనిపిస్తున్నాయి.
Vijay Antony: నా కూతురుతో పాటు నేనూ చనిపోయాను.. మీరా మరణం తరువాత విజయ్ ట్వీట్
ఇంతకుముందు గంభీర్ షారుక్ ఖాన్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. షారుక్ బాలీవుడ్‌కే కాదు హృదయాలకు కూడా రారాజు అన్నారు. షారుక్ ఖాన్ని కలిసినప్పుడల్లా తనకు చాలా ప్రేమ కలుగుతుందని.. షారుక్ ది బెస్ట్ అన్నారు. మరోవైపు 2023లో కేకేఆర్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన నితీష్ రాణా.. గంభీర్ పునరాగమనంపై సూచన చేశాడు. షారుఖ్, గంభీర్ తమ రంగాలకు రాజులు అని ట్వీట్ చేశాడు. ఇది ఇంటికి తిరిగి రావడానికి సంకేతం కాదా? నేను దాని గురించి ఆలోచిస్తున్నానన్నారు.
True kings in their own fields! 👑 👑
Could this be a sign of a homecoming? Just wondering 💭 https://t.co/Rcg8GkqmJn
— Nitish Rana (@NitishRana_27) September 21, 2023
తాజావార్తలు
-
Supreme Court: సీజేపీ నిరసన ఎఫెక్ట్.. పోలీసులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..
-
Chiranjeevi: వయసు ఒక నంబర్ మాత్రమే..! ప్రేమ, అభిమానమే నాకు ఎనర్జీ..
-
Redmi K200 Series: Redmi K200 సిరీస్‌లో 7 ఇంచుల 2K డిస్ప్లే?.. హై రిఫ్రెష్ రేట్‌తో రానున్న కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్లు!
-
Rashmika Mandanna : మరోసారి పుష్పరాజ్ అండ్ శ్రీవల్లి కాంబో ఆకట్టుకోబోతుందా..?
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!