నీతా అంబాని.. ఈ మధ్య ఈ పేరు ఎక్కువగా వినిపిస్తుంది.. సినీ స్టార్స్ కన్నా ఎక్కువ ఫాలోయింగ్ ఈమెకు ఉంది.. ఏ ఫంక్షన్ కు వెళ్లినా, పార్టీలకు వెళ్ళినప్పుడు ఈమె స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తుంది..తన ఫ్యాషన్ ఔటింగ్‌లతో ప్రజలను ఆశ్చర్యపరుస్తుంది..ఈవెంట్‌తో సంబంధం లేకుండా, అత్యంత విశిష్టతతో కనిపిస్తుంది. ఆమె ధరించే దుస్తులు, చెప్పులు, పర్సులు ఇలా అన్నీ సరికొత్తవి, చాలా ప్రత్యేకమైనవి. ముఖ్యంగా నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ ప్రారంభించినప్పటి నుండి, నీతా అంబానీ లుక్‌తో తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ఈ సాంస్కృతిక కార్యక్రమంలో కాఫీ టేబుల్ పుస్తకాన్ని ఆవిష్కరించారు..
ఈ కార్యక్రమానికి నీతా అంబాని కూడా హాజరయ్యారు..ఈ సందర్భంగా నీతా అంబానీ తన చేతిలో తెల్లటి మాట్ ఎలిగేటర్ హ్యాండ్‌బ్యాగ్‌తో కనిపించారు. ఈ హ్యాండ్‌బ్యాగ్ హెర్మేస్ బిర్కిన్ బ్రాండ్‌కు చెందినది. దీని డిజైన్ చాలా ప్రత్యేకమైనది.. సరి కొత్త లుక్ తో ఉండటంతో అందరి చూపు దానివైపే ఉంది.. నీతా అంబానీ చేతిలో కనిపించిన హ్యాండ్ బ్యాగ్‌పై బిల్డింగ్ బొమ్మ కనిపించింది. పర్సు హ్యాండిల్‌పై నారింజ రంగులో వేలాడుతున్న విండోస్ ఆకారం ఉంది. ఇంకా ఆ పర్స్‌పై పలు అక్షరాలతో కూడిన పేర్లు కూడా ఉన్నాయి..
ఇన్ని ప్రత్యేకతలు ఉన్న ఈ బ్యాగ్ ధర ఇండియన్ కరెన్సీ ప్రకారం అక్షరాల రూ. 3.2 కోట్లు అని తెలిసింది. ఈ బ్రాండ్ బ్యాగ్‌లు కొనడం చాలా కష్టం. దాని ధర కారణంగా మాత్రమే కాకుండా, బ్రాండ్ ఎంపిక చేసుకున్న వ్యక్తుల కోసం మాత్రమే బ్యాగ్‌లను డిజైన్ చేస్తుంది. బ్యాగ్‌ను తయారు చేయడానికి ఆర్డర్ ఇచ్చిన తరువాత 1 సంవత్సరం పాటు వేచి ఉండాల్సి ఉంటుందట.. అంటే ఆ బ్యాగ్ ను ప్రత్యేకంగా తయారు చెయ్యడానికి అంత సమయం పడుతుందని అర్థం.. నిజానికి నీతా అంబానీకి హ్యాండ్‌బ్యాగ్‌లంటే చాలా ఇష్టమని, ఆమె కలెక్షన్‌లో ప్రపంచంలోని అత్యంత ఖరీదైన బ్రాండ్‌ల బ్యాగ్‌లు ఉన్నాయని తెలుస్తుంది.. అంతే వాచ్ లను చెప్పులను కూడా ఎక్కువగా కలెక్ట్ చేస్తుందని టాక్.. డబ్బులు ఉంటే ఇంతే మరి..