ప్రముఖ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఇటీవల వచ్చిన హనుమాన్ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మించిన ప్రొడక్షన్ హౌస్ ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్. నిరంజన్ రెడ్డి ఈ ప్రొడక్షన్ ద్వారా మొదటి ప్రయత్నంలోనే పాన్ ఇండియా మూవీ చేసి సూపర్ హిట్ కొట్టాడు.. ఆ సినిమా కలెక్షన్స్ కూడా బాగానే రాబట్టింది.. ఇక ఈ సినిమాకు సీక్వెల్ గా సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే.. త్వరలోనే ఈ సినిమా గురించి మరో అప్డేట్ రానుంది..
ఈ సినిమాను మరింత భారీ బడ్జెట్ తో నిర్మించబోతున్నారు. నిర్మాత నిరంజన్ రెడ్డి నుంచి ప్రొడక్షన్ నెంబర్ 2గామరో స్టార్ హీరో సినిమా రావొచ్చని అందరూ భావించారు. అయితే తన ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ నుంచి అవుట్ అండ్ అవుట్ క్రేజీ కామెడీ కథాంశంతో మూవీ చేయబోతున్నట్లు తెలుస్తోంది.. బలగం సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ప్రియదర్శి, ఇస్మార్ట్ పోరి నభా నటేష్ జోడీగా ఈ మూవీ తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది.. ఈ సినిమాను సైలెంట్ గా సెట్స్ మీదకు తీసుకెళ్లారు.. ఈ సినిమా షూటింగ్ పూర్తి కావొస్తుంది.. త్వరలోనే సినిమాను అనౌన్స్ చేయబోతున్నట్లు సమాచారం..
నిరంజన్ రెడ్డి కూడా లో బడ్జెట్ లో ఈ సినిమాని చేసి కంటెంట్ బేస్డ్ కథలని కూడా తన ప్రొడక్షన్ హౌస్ లో నిర్మిస్తానని యువ దర్శకులకి సందేశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.. ఈ సినిమా తర్వాత మెగా మేనల్లుడు తో మరో సినిమా చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. ఈ సినిమా తర్వాత స్టార్ హీరోతో సినిమా చేయబోతున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి..