NTV Telugu Site icon

Nimmala Ramanaidu : 2014 నుంచి ఇరిగేషన్ శాఖకు చంద్రబాబు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు

Nimmala

Nimmala

Nimmala Ramanaidu : 2014 నుంచి ఇరిగేషన్ శాఖ కు చంద్రబాబు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారన్నారు ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. ఇవాళ కడపజిల్లా జమ్మలమడుగులో మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ.. గడిచిన 5 సంవత్సరాల వైసీపీ పాలనలో అన్ని శాఖలు నిర్విర్యం అయ్యాయన్నారు. వైసీపీ పాలనలో ఇరిగేషన్ శాఖకు సంబంధించి ఏ ఒక్క రిజర్వాయర్ కు చిన్న పని కూడా చేయలేదన్నారు. చివరికి రిజర్వాయర్ల మెయింటెనెన్స్ కూడా వైసిపి పాలనలో చేయలేకపోయారని, గాడి తప్పిన ఇరిగేషన్ శాఖను తిరిగి గాడిలో పెట్టడానికి కూటమి ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తుందన్నారు మంత్రి నిమ్మల.

Rahul Gandhi: రాహుల్ గాంధీకి నోటీసులు.. ఆ రోజు కోర్టుకు రావాలని వెల్లడి

2014 నుంచి 19 వరకు టీడీపీ ప్రభుత్వం లో డెబ్భై వేల కోట్లు ఇరిగేషన్ శాఖకు కేటాయించామని, 2019 నుంచి 24 వరకు వైసీపీ 32 వేల కోట్లు కేటాయించి 19 వెల కోట్లు ఖర్చు చేశారన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు. బడ్జెట్ తక్కువగా ఉన్న కూడా 9.6 శాతం టీడీపీ కేటాయించిందని, వైసీపీ ప్రభుత్వం లో 2.3 శాతం మాత్రమే కేటాయించిందన్నారు. రాయలసీమ ద్రోహి జగన్మోహన్ రెడ్డి అని ఆయన ఆరోపించారు. రాయలసీమకు జగన్మోహన్ రెడ్డి చేసిన ద్రోహం చూస్తుంటే మాకే బాధేస్తుందన్నారు. 2014-19 లో బడ్జెట్ తక్కువగా ఉన్న 12 వేల కోట్లు రాయలసీమ కు కేటాయించామని, 2019-24 వైసీపీ పాలనలో 2200 కోట్లు మాత్రమే రాయలసీమ కు కేటాయించారన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు.

Nara Bhuvaneshwari : చంద్రబాబు దూర దృష్టితో ఆలోచిస్తారు.. చంద్రబాబు విజనరీ రాష్ట్రానికి ఎంతో అవసరం

Show comments