ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌లో ప్రమాదం చోటు చేసుకుని మూడు రోజులు గడుస్తుంది. టన్నెల్‌లో గల్లంతైన ఎనిమిది మంది ఆచూకీపై ఇంకా క్లారిటీ లేదు. రెస్క్యూ టీమ్స్ పలుమార్లు టన్నెల్‌లోకి వెళ్లి ముందుకు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో తిరిగి వచ్చాయి. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. రెస్క్యూ విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధిని ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. టన్నెల్లో చిక్కుకున్న వారిని క్షేమంగా తిరిగి తీసుకురావడానికి సర్వ శక్తులా ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు.
Nimmala Ramanaidu : 2014 నుంచి ఇరిగేషన్ శాఖ కు చంద్రబాబు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారన్నారు ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. ఇవాళ కడపజిల్లా జమ్మలమడుగులో మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ.. గడిచిన 5 సంవత్సరాల వైసీపీ పాలనలో అన్ని శాఖలు నిర్విర్యం అయ్యాయన్నారు. వైసీపీ పాలనలో ఇరిగేషన్ శాఖకు సంబంధించి ఏ ఒక్క రిజర్వాయర్ కు చిన్న పని కూడా చేయలేదన్నారు. చివరికి రిజర్వాయర్ల మెయింటెనెన్స్ కూడా వైసిపి పాలనలో చేయలేకపోయారని, గాడి…