టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈ యంగ్ హీరో వరుసగా కాన్సెప్ట్ బేస్డ్ స్టోరీలను ఎంచుకుంటూ వరుస హిట్స్ తన ఖాతాలో వేసుకుంటున్నాడు.ఈ యంగ్ హీరో నటిచించిన కార్తికేయ 2 సినిమా పాన్ ఇండియా స్థాయిలో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది .ఈ సినిమాతో నిఖిల్ సిద్దార్థ మార్కెట్ భారీగా పెరిగింది.ప్రస్తుతం ఈ యంగ్ హీరో వరుసగా భారీ బడ్జెట్ సినిమాలు లైన్ లో పెడుతున్నాడు.ఈ యంగ్ హీరో నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “స్వయంభు”.ఈ చిత్రాన్ని భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్నాడు. ఠాగూర్ మధు సమర్పణలో పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్‌పై భువన్, శ్రీకర్ నిర్మిస్తున్న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళం, హిందీ, మలయాళం మరియు కన్నడ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది.
నిఖిల్ 20 వ సినిమాగా స్వయంభు మూవీ తెరకెక్కుతుంది. ఈ మూవీలో నిఖిల్ సరసన మలయాళ బ్యూటీ సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ మరో హీరోయిన్ గా నటించింది . కాగా ఈ మూవీ నుంచి మేకర్స్ రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.ప్రస్తుతం ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.తాజాగా ఈ సినిమా మేకర్స్ ఓ ఆసక్తికర అప్‌డేట్ ను అందించారు. స్వయంభు టీం.. ఒక పురాతన కాలం బ్యాక్‌డ్రాప్‌లో సాగే యుద్ధ ఎపిసోడ్‌ను భారీ స్థాయిలో చిత్రీకరిస్తోంది. 12 రోజులపాటు జరుగనున్న ఈ షెడ్యూల్‌ను రూ.8 కోట్ల భారీ బడ్జెట్‌తో షూట్ చేస్తున్నాము . నిఖిల్ యాక్షన్, స్టంట్స్‌తో సాగే ఈ భారీ వార్ సీక్వెన్స్ అద్భుతంగా ఉండబోతుందని మేకర్స్ ట్వీట్ చేశారు. తాజా అప్‌డేట్ ఈ సినిమాపై మరింతగా అంచనాలు పెంచేసింది.
Team #Swayambhu is filming an epic war episode on a grand scale.
The schedule, that will last for 12 days, is being filmed with a Massive budget of Rs. 8 Crore and will show @actor_Nikhil's prowess in action and stunts. This sequence will be stunning on the big screens ❤🔥 pic.twitter.com/YVuTP66kPM
— Pixel Studios (@PixelStudiosoff) May 7, 2024