Nidhhi Agerwal: ‘ది రాజా సాబ్’ సినిమా వేడుకలో హీరోయిన్ నిధి అగర్వాల్ చేసిన వ్యాఖ్యలు అందరి మనసులను తాకాయి. మీడియా, ప్రత్యేక అతిథుల సమక్షంలో ఆమె మాట్లాడుతూ.. ఈ రోజు తనకు ఎంతో ప్రత్యేకమైన రోజని అన్నారు. “మీరు అందరూ మా ఇంట్లోకి వచ్చినట్టే ఉంది. ఇది మా రెండో ఇల్లు. ఎన్నో సంవత్సరాలుగా ఈ సెట్స్‌లోనే మేము షూటింగ్ చేశాం. ఈ కారిడార్లలో పరుగెత్తాం, ఈ ప్యాలెస్ అంతటా సన్నివేశాలు తీశాం” అంటూ తన అనుభూతులను పంచుకున్నారు.
Raja Saab: స్టేజ్‌పై కన్నీళ్లు పెట్టుకున్న రాజాసాబ్ నిర్మాత విశ్వప్రసాద్..
ఈ సినిమా తన కెరీర్‌లో అత్యంత ప్రత్యేకమైన చిత్రంగా నిలుస్తుందని నిధి పేర్కొన్నారు. అందుకు ప్రధాన కారణం ఈ చిత్రంతో కలిసి పనిచేసిన బృందమేనని తెలిపారు. “సెట్‌లో నేను ఇంత సరదాగా ఎప్పుడూ గడపలేదు. నన్ను ఇంత ప్రేమగా, గౌరవంగా, ముద్దుగా చూసిన అనుభవం ఇదే తొలిసారి” అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. తనను ఈ చిత్రానికి ఎంపిక చేసిన దర్శకుడు మారుతీకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. అలాగే పాత్రను నమ్మి ఇచ్చినందుకు SKN, విశ్వ సర్‌లకు ధన్యవాదాలు తెలిపారు.
Draupadi 2: ‘ద్రౌపది 2’ నుంచి ‘తారాసుకి..’ సాంగ్ రిలీజ్..
ఈ సందర్భంగా సినిమా బృందంలోని సభ్యులందరినీ నిధి గుర్తు చేసుకున్నారు. కొంతమంది ఈ వేడుకకు హాజరు కాలేకపోయారని చెప్పి, వారిని మిస్ అవుతున్నామని అన్నారు. ముఖ్యంగా హీరో ప్రభాస్ ఈరోజు వేడుకకు రాలేకపోయినందుకు అభిమానిగా తాను నిజంగా మిస్ అవుతున్నానని చెప్పారు. “సినిమా నేను ఇప్పటికే చూశాను. ఇది చాలా బాగా ఉంది. ఈ సినిమా తర్వాత ప్రేక్షకులు మిమ్మల్ని మరింతగా జరుపుకుంటారని నాకు నమ్మకం ఉంది” అంటూ చిత్రంపై తన విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.