Cricket: అతని రికార్డును బద్దలు కొట్టడం అసాధ్యం..! సిక్సర్ల మోత
- 2024లో 150 సిక్సర్లు కొట్టి చరిత్ర సృష్టించిన నికోలస్ పూరన్
- అంతకుముందు క్రిస్ గేల్ పేరిట రికార్డ్
- 2015లో 135 సిక్సర్లు బాదిన గేల్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
క్రికెట్లో రికార్డులు బ్రేక్ అవుతూనే ఉంటాయి. ఎంతోమంది దిగ్గజాల రికార్డును బద్దలు కొట్టిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఈ బ్యాటర్ రికార్డును బ్రేక్ చేయడం అసాధ్యంగా కనిపిస్తోంది. ఇంతకీ ఆ బ్యాటర్ ఎవరనుకుంటున్నారా..? వెస్టిండీస్ క్రికెటర్, మాజీ కెప్టెన్ నికోలస్ పూరన్.. అంతకుముందు.. అత్యధిక టీ20 సిక్సర్లు బాదిన ప్రపంచ రికార్డు కరీబియన్ బ్యాట్స్‌మెన్, యూనివర్స్ బాస్ క్రిస్ గేల్ పేరిట ఉండేది. 2015లో గేల్ 135 సిక్సర్లు కొట్టాడు. అయితే.. ఆ రికార్డును తొమ్మిదేళ్ల తర్వాత తమ దేశ ఆటగాడు నికోలస్ పూరన్ బద్దలు కొట్టాడు. ఇంకా ఈ సంవత్సరం ముగియడానికి చాలా రోజులు ఉన్నాయి. ఇంకెన్ని సిక్సర్ల వర్షం కురిపిస్తాడో..
UP: యంత్రంతో 60 ఏళ్ల వృద్ధులను 25 ఏళ్లలోపు యువతగా మారుస్తామని చెప్పి.. ఆపై…
Also Read
- PM Modi Paris Speech: 12 ఏళ్లలో నూతన భారత్ ఆవిష్కరణ.. పారిస్‌లో అభివృద్ధి గాథను వివరించిన ప్రధాని మోడీ
- Papaya Seeds Health Benefits: బొప్పాయి గింజలను పారేస్తున్నారా..? ఈ రహస్యాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు!
- Modi-Macron: ఫ్రాన్స్-భారత్ స్నేహం వర్ధిల్లాలి.. మాక్రాన్ ఆసక్తికర పోస్ట్
- Jharkhand: రాజ్యసభ విజయం తర్వాత హేమంత్ సోరెన్‌ను కలిసిన బైద్యనాథ్ రామ్
సెప్టెంబర్ 22న ట్రిన్‌బాగో నైట్ రైడర్స్, సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్ మధ్య జరిగిన కరేబియన్ ప్రీమియర్ లీగ్ (CPL) 2024 మ్యాచ్‌లో.. పూరన్ 43 బంతుల్లో 93 నాటౌట్ ఇన్నింగ్స్ ఆడాడు. అతని ఇన్నింగ్స్‌లో ఏడు సిక్సర్లు బాదాడు. టీ20 క్రికెట్లో ఒక సంవత్సరంలో 150 సిక్సర్ల మ్యాజిక్ ఫిగర్‌ను తాకింది. పురాన్ బలమైన ఇన్నింగ్స్‌తో ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. 20 ఓవర్లలో సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్ నాలుగు వికెట్ల నష్టానికి 193 పరుగులు చేయగా.. ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ 18.3 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. జాసన్ రాయ్ 34 బంతుల్లో 64 పరుగులు చేశాడు.
Nitin Gadkari: నాలుగోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్న గ్యారెంటీ లేదు..!
టీ20 క్రికెట్ చరిత్రలో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాట్స్మెన్ల గురించి చెప్పాలంటే.. క్రిస్ గేల్ అగ్రస్థానంలో ఉన్నాడు. 2005 నుంచి 2022 మధ్య క్రిస్ గేల్ మొత్తం 1056 సిక్సర్లు బాదాడు. ఇప్పటివరకు మొత్తం 892 సిక్సర్లు బాదిన కీరన్ పొలార్డ్ ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో మొత్తం 709 సిక్సర్లు బాదిన ఆండ్రీ రస్సెల్ మూడో స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత పూరన్ ఉన్నాడు. అతని ఖాతాలో ఇప్పటివరకు 563 సిక్సర్లు ఉన్నాయి. టీ20 క్రికెట్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన టాప్-4 బ్యాట్స్మెన్లు కరేబియన్‌కు చెందినవారే ఉన్నారు. దీనికి అతిపెద్ద కారణం కరేబియన్ ఆటగాళ్లు ప్రపంచవ్యాప్తంగా వివిధ టీ20 లీగ్‌లలో అత్యధికంగా పాల్గొనడం.
తాజావార్తలు
-
PM Modi Paris Speech: 12 ఏళ్లలో నూతన భారత్ ఆవిష్కరణ.. పారిస్‌లో అభివృద్ధి గాథను వివరించిన ప్రధాని మోడీ
-
Papaya Seeds Health Benefits: బొప్పాయి గింజలను పారేస్తున్నారా..? ఈ రహస్యాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు!
-
Modi-Macron: ఫ్రాన్స్-భారత్ స్నేహం వర్ధిల్లాలి.. మాక్రాన్ ఆసక్తికర పోస్ట్
-
Jharkhand: రాజ్యసభ విజయం తర్వాత హేమంత్ సోరెన్‌ను కలిసిన బైద్యనాథ్ రామ్
-
Rajyasabha Elections: మా ఓటమికి లెఫ్ట్, ఆర్జేడీలే కారణం.. రాజ్యసభ ఓటమిపై కాంగ్రెస్ ఆగ్రహం..
ట్రెండింగ్
-
Ravi Kishan : ‘రేసుగుర్రం’ విలన్‌పై నెటిజన్ల ఫన్నీ ట్రోల్స్.. ‘గుట్కాసన్’ అంటూ మీమ్స్ వైరల్.!
-
5 Best Indoor Plants : ఇంట్లో గ్రీనరీ కావాలా.? మట్టిలేకుండా నీటిలో పెరిగే 5 ప్లాంట్స్ ఇవే.!
-
Kitchen Hacks : పూరీ.. పకోడా.. బజ్జీ వేయించిన తర్వాత నూనె మిగిలిందా.? పారేయకండి ఇలా చేయండి.!
-
Ira Aery: ఇరా ఏరీ.. పోలా అదిరిపోలా.. సరికొత్త క్రికెట్ క్రష్!
-
Fact Check: E20 పెట్రోల్ కొట్టిస్తే చీమలు పడుతున్నాయా? వైరల్ వీడియోపై క్లారిటీ..