ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రెండో రోజు సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం.. పాల్గొననున్న మంత్రులు, ఎమ్మెల్యేలు.. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు వివరించనున్న నేతలు
ఇవాళ బెంగుళూరుకు వైసీపీ అధినేత వైఎస్ జగన్.. ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరనున్న జగన్.. మధ్యాహ్నం 2 :40 గంటలకు బెంగుళూరులోని ఆయన నివాసానికి చేరుకోనున్న జగన్
ఇవాళ కుప్పంలో స్థానిక కార్యక్రమాల్లో పాల్గొననున్న సీఎం చంద్రబాబు.. ఇవాళ సాయంత్రం అమరావతికి ఏపీ సీఎం
ప్రకాశం జిల్లా పొదిలిలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటన.. ఉదయం 10:30 గంలకు పొదిలి మండలం ఏలూరులో 33/11 కెవి విద్యుత్ సబ్ స్టేషన్ శంఖుస్థాపన కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి.. అనంతరం సుపరిపాలన-తొలిఅడుగు కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి గొట్టిపాటి
జరుగుమల్లిలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి, ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, మ్యారిటైం బోర్డ్ చైర్మన్ దామచర్ల సత్య
నేడు ప్రైవేట్ విద్యాసంస్థలు బంద్.. ఆంధ్రప్రదేశ్ ప్రైవేటు పాఠశాలల యాజమాన్యం సంయుక్త నిర్ణయం మేరకు బంద్.. తప్పుడు ఫిర్యాదులపై త్రీ మెన్ కమిటీ దాడులు అపాలని డిమాండ్
నేడు నగరం, నిజాంపట్నం మండలాల్లో మంత్రి అనగాని సత్యప్రసాద్ పర్యటన.. సుపరిపాలన-తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొనున్న మంత్రి అనగాని
నేటితో ముగియనున్న చెవిరెడ్డి మూడు రోజుల కస్టడీ.. చెవిరెడ్డితో పాటు వెంకటేష్ నాయుడును ఇవాళ కస్టడీకి తీసుకోనున్న సిట్.. సాయంత్రం న్యాయస్థానంలో హాజరుపరచనున్న సిట్
వైభవంగా కొనసాగుతున్న వరంగల్ భద్రకాళి అమ్మవారు శాఖాంబరి ఉత్సవాలు.. 8వ రోజుకు చేరిన అమ్మవారి శాకాంభరీ నవరాత్రి మహోత్సవాలు.. ఉదయం ఉగ్రప్రభాక్రమం, సాయంత్రం త్వరితాక్రమం అలంకరణలో భక్తులకు దర్శనం ఇవ్వనున్న అమ్మవారు
నేడు సిగాచి పరిశ్రమ వద్దకు నిపుణుల కమిటీ.. పరిశ్రమలో పేలుడు ఘటనపై దర్యాప్తు చేయనున్న నలుగురు నిపుణుల కమిటీ బృందం
నేడు ఖమ్మం జిల్లాలో మంత్రులు తుమ్మల, పొంగులేటి పర్యటన
విదేశీ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీ.. ఘనాతో పలు ఒప్పందాలు కుదుర్చుకున్న భారత్
ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఇంగ్లాండ్, భారత్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు.. నేడు రెండో రోజు ఆట కొనసాగనుంది.. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్లు కోల్పోయి 310 పరుగులు చేసిన భారత్