Kidnap Mystery: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అల్లూరి జిల్లా గ్రామ సచివాలయ మహిళా ఉద్యోగి కిడ్నాప్ మిస్టరీ వీడింది. బలవంతపు పెళ్లి కోసమే కిడ్నాప్ జరిగినట్లు పోలీసులు తేల్చారు. ప్రధాన నిందితుడితోపాటు అతనికి సహకరించిన మరో నలుగురిని అరెస్ట్ చేశారు. కిడ్నాపర్ల చెర నుంచి ఆమెను విడిపించారు. రంపచోడవరం ప్రాంతం.. దేవీపట్నం మండలం, శరభవరం సచివాలయంలో సోయం శ్రీసౌమ్య విలేజ్ అసిస్టెంట్‌గా ఉద్యోగం చేస్తోంది. ఆమె విధుల్లో ఉండగానే కొంత మంది దుండగులు ఇన్నోవా కారులో వచ్చి…
శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ఎంతో పురోభివృద్ధి సాధించినప్పటికీ సమాజంలో బాల్య వివాహాలు, వరకట్న వేధింపులు మాత్రం పట్టి పీడిస్తూనే ఉన్నాయి. ఆర్థిక పరిస్థితుల కారణంగా పిల్లలను పోషించే శక్తిలేక బాల్యంలోనే పెళ్లిళ్లు చేయడానికి సిద్ధపడుతున్నారు కొందరు తల్లిదండ్రులు. ఆస్తులను ఆశగా చూపి తమ కంటే 20 ఏళ్లు తక్కువ వయసున్న బాలికలను పెళ్లి చేసుకునేందుకు రెడీ అవుతున్నారు కొందరు వ్యక్తులు. ఇలాంటి ఘటనే రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. షాద్ నగర్ నందిగామలో బాల్య వివాహం చేసుకున్న వ్యక్తిపై…
హైదరాబాద్ బాలనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నవవధువు ఆత్మహత్య చేసుకుంది.. పెళ్లయిన నెల రోజులకే గంట విజయ గౌరీ(20) ఇంట్లో ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. బీటెక్ మూడవ సంవత్సరం చదువుతున్న ఆ యువతికి గత నెల ఫిబ్రవరి 6న నందిగామ విజయనగరానికి చెందిన ఈశ్వర రావు(35) తో వివాహం జరిగింది.. మృతురాలి స్వస్థలం పార్వతీపురం. ఉద్యోగ నిమిత్తం నగరానికి వచ్చిన ఈశ్వరరావు బాలనగర్ పీఎస్ పరిధిలోని బాల్ రెడ్డినగర్‌లో ఇల్లు తీసుకొని అద్దెకు ఉంటున్నాడు.. గత నెల…
Karnataka : కర్ణాటక రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. కూతురి పట్ల కన్న తండ్రే కసాయి వాడయ్యాడు. ముక్కు పచ్చలారని పసి కందును తీసుకెళ్లి బలవంతంగా ముసలోడికి కట్టబెడ్డాడు.