Vikram Rathod: న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్ల మధ్య ఏకైక టెస్ట్ మ్యాచ్ సెప్టెంబర్ 9 నుండి ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కి కివీస్ జట్టు భారీ ప్రకటన చేసింది. వారి జట్టు కోచింగ్ స్టాఫ్‌లో భారత క్రికెట్ జట్టు మాజీ బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్‌ను చేర్చుకున్నారు. అలాగే స్పిన్ కోచ్ గా శ్రీలంక మాజీ ఆటగాడు రంగనా హెరాత్ ని కూడా చేర్చుకున్నారు. ఆఫ్ఘనిస్థాన్ తో సిరీస్ తర్వాత, న్యూజిలాండ్ కూడా భారత్ తో 3 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడాల్సి ఉంది.
Gold Price Today: గోల్డ్ లవర్స్‌కి బిగ్ షాక్.. వారం రోజుల్లోని పెరుగుదల ఒక్కరోజే!
ఈ సందర్బంగా న్యూజిలాండ్ కోచ్ గ్యారీ స్టెడ్ మాట్లాడుతూ.., “ఈ ఇద్దరు వ్యక్తులకు ప్రపంచ క్రికెట్‌లో భిన్నమైన గుర్తింపు ఉంది. వారిద్దరి నుండి నేర్చుకునేందుకు మా ఆటగాళ్లు ఈ అవకాశాన్ని పూర్తిగా ఉపయోగించుకోవాలని నేను ఆశిస్తున్నాను. మాకు 3 ఎడమ చేతి స్పిన్నర్లు ఉన్నారు. అటువంటి పరిస్థితిలో మేము హెరాత్ నుండి చాలా సహాయం పొందుతాము. ముఖ్యంగా అతని అనుభవం మాకు ఉపయోగకరంగా ఉంటుంది. త్వరలో శ్రీలంకతో న్యూజిలాండ్ కూడా టెస్టు సిరీస్ ఆడాల్సి ఉంది.
Whiskey Ice Cream: హైదరాబాద్ లో విస్కీ ఐస్ క్రీం కలకలం..