New Rules For Chit Funds: చిట్స్ నిర్వహణలో కొత్త రూల్స్.. ఇకపై ఇలా చేయాల్సిందే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
New Rules For Chit Funds: చిట్స్ నిర్వహణలో కొత్త విధానాన్ని తీసుకొచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఇక నుంచి అంతా ఆన్ లైన్ విధానంలో లావాదేవీలు జరపాల్సి ఉంటుంది.. అందులో భాగంగా ఈ -చిట్స్ అనే ఎలక్ట్రానిక్ అప్లికేషన్‌ను ప్రారంభించారు మంత్రి ధర్మన ప్రసాదరావు.. ఈ చిట్స్ అనే ఎలక్ట్రానిక్‌ను రూపొందించింది ఆంధ్రప్రదేశ్ రెవిన్యూ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖలు.. ఈ సందర్భంగా మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ.. ఏపీలో చిట్ ఫండ్ వ్యాపారం పారదర్శకంగా జరిగేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు.. ఏపీ స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ ఆధ్వర్యంలో ఈ- చిట్స్ అనే ఎలక్ట్రానిక్ విధానం ప్రారంభిస్తున్నాం.. చందాదారులు అంతా ఈ- చిట్స్ ద్వారా తన డబ్బు సురక్షితంగా ఉందో లేదో ఈ కొత్త విధానం ద్వారా తెలుసుకోవచ్చు అన్నారు..
Read Also: Punjab Court: రూ.100 కోట్ల పరువు నష్టం కేసు.. మల్లికార్జున్ ఖర్గేకు పంజాబ్ కోర్టు సమన్లు
Also Read
చిట్స్ వేసే చందాదారు మోస పోకుండా చూడాలనే ఈ విధానం అని పనిచేస్తుందన్నారు మంత్రి ధర్మాన.. కొత్త విధానం ప్రకారం అన్ని చిట్ ఫండ్ కంపెనీలు ఆన్ లైన్ ద్వారా మాత్రమే లావాదేవీలు నిర్వహించాలని పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు ఆన్లైన్లో పరిశీలించి ఆమోదం తెలియజేస్తారన్న తెలిపారు.. ఈ విధానం ద్వారా మాత్రమే ఇక నుంచి చిట్లు నిర్వహించాలి.. గతంలో నమోదు అయిన సంస్థలు క్రమంగా ఈ విధానంలోకి రావాల్సిందేనన్నారు మంత్రి ధర్మాన ప్రసాదరావు. కాగా, గత కొంత కాలంగా కొన్ని ప్రైవేట్ చిట్ సంస్థల్లో సీఐడీ సోదాలు కలకలం రేపాయి.. ఈ కేసులో కొందరిని సీఐడీ అధికారులు ప్రశ్నించిన విషయం విదితమే. చిట్స్ విధానంలోనే తప్పులు ఉన్నాయనే విమర్శలు వచ్చాయి.. దీంతో.. చిట్స్ నిర్వహణలో కొత్త విధానాన్ని రూపొందించింది ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్ జగన్మోహన్రెడ్డి సర్కార్.
తాజావార్తలు
-
Gossip : “రేపే థియేటర్లలో ‘గాసిప్’
-
Ram Mandir Donation Scam: రామ మందిర విరాళాల వ్యవహారంలో ట్విస్ట్.. 8 మందిపై ఎఫ్ఐఆర్
-
Pawan Kalyan :మీరు అడిగారు, మేము విన్నాం.. ఓజీ యూనివర్స్‌లోకి స్వాగతం
-
Pakistan Cricket Player: నా భార్య సపోర్ట్ ఇండియాకే.. పాక్ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు..
-
DOST : డిగ్రీ సీట్లకు డిమాండ్ డౌన్.. ప్రభుత్వ కాలేజీలకే క్రేజ్.!
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో భారత్‌లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్‌హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్‌లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!