Ayodhya New Airport: డిసెంబర్ 30న ప్రారంభించనున్న అయోధ్యలోని విమానాశ్రయానికి ‘మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం అయోధ్యధామ్’గా నామకరణం చేశారు. ఈ విమానాశ్రయానికి రామాయణ పురాణ రచయితగా ప్రసిద్ధి చెందిన పురాణ కవి వాల్మీకి పేరు పెట్టారు. ఈ విమానాశ్రయాన్ని గతంలో ‘మర్యాద పురుషోత్తం శ్రీ రామ్ అయోధ్య అంతర్జాతీయ విమానాశ్రయం’ అని పిలిచేవారు. అంతకంటే ముందు రోజు డిసెంబర్ 27న అయోధ్య రైల్వే స్టేషన్ పేరును అయోధ్య ధామ్ జంక్షన్‌గా మార్చిన సంగతి తెలిసిందే. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Read Also: Aditya-L1 Mission: తొలి సోలార్ మిషన్ ఆదిత్య-ఎల్1 గురించి ఇస్రో చీఫ్ కీలక ప్రకటన
భారత ప్రధాని నరేంద్ర మోడీ డిసెంబర్ 30వ తేదీన అయోధ్యలో పర్యటించనున్నారు. డిసెంబర్ 30న కొత్తగా నిర్మించిన విమానాశ్రయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. మహా సంప్రోక్షణ కార్యక్రమం 2024 జనవరి 22న జరగనుంది. ఎయిర్‌పోర్టు ప్రారంభించిన రోజున, మొదటి విమానాలను ఇండిగో, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ నిర్వహిస్తాయి. రెండు విమానయాన సంస్థలు ఇప్పటికే ఢిల్లీ, ముంబై, అహ్మదాబాద్ నుండి అయోధ్యకు విమానాలను ప్రకటించాయి, ఇవి జనవరి 2024 నుంచి ప్రారంభమవుతాయి.
Read Also: CM Siddaramaiah: సైన్ బోర్డులన్నీ కన్నడ భాషలోనే ఉండాలి.. సీఎం కీలక ప్రకటన
విమానాశ్రయం మొదటి దశ నిర్మాణానికి దాదాపు రూ.1,450 కోట్లు ఖర్చుతో అభివృద్ధి చేశారు. కొత్త టెర్మినల్ భవనం, 6,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో, 600 మంది పీక్-అవర్ ప్రయాణీకులకు వసతి కల్పించడానికి రూపొందించబడింది. వార్షిక నిర్వహణ సామర్థ్యం 10 లక్షల మంది ప్రయాణికులు. రెండవ దశ అభివృద్ధిలో 50,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో కొత్త టెర్మినల్ భవనం నిర్మించబడుతుందని, రద్దీ సమయాల్లో 3,000 మంది ప్రయాణికులు మరియు ఏటా 60 లక్షల మంది ప్రయాణికులను నిర్వహించగల సామర్థ్యం ఉందని అధికార వర్గాలు తెలిపాయి.