Yusuf Pathan Fifty: యూసఫ్ పఠాన్ విధ్వంసం.. 14 బంతుల్లోనే 61 రన్స్! చుక్కలు చూసిన పాక్ బ్యాటర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND Batter Yusuf Pathan Smashes PAK Pacer Mohammad Amir For 24 Runs In Single Over: టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యూసఫ్ పఠాన్ విధ్వంసం సృష్టించాడు. నాలుగు పదుల వయసులోనూ ఆకాశమే హద్దుగా చెలరేగి.. తనలో బ్యాటింగ్ చేసే సత్తా ఇంకా ఉందని చాటిచెప్పాడు. సిక్స్‌ల వర్షం కురిపిస్తూ 14 బంతుల్లోనే 61 పరుగులు చేశాడు. యూఏఈ క్రికెట్ బోర్డు ఆధ్వర్యంలో జరుగుతున్న టీ10 లీగ్‌లో పఠాన్ ఈ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. దాంతో జోబర్గ్ బఫ్పాలోస్ జట్టుకు ఊహించని విజయాన్ని అందించాడు.
టీ10 లీగ్‌లో భాగంగా శుక్రవారం జోబర్గ్ బఫ్పాలోస్, డర్బన్ ఖలాండర్స్ జట్ల మధ్య క్వాలిఫయర్ 1 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన డర్బన్ జట్టు నిర్ణీత 10 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది. ఆండ్రీ ఫ్లెచర్ (39), ఆసిఫ్ అలీ (32 నాటౌట్) టాప్ స్కోరర్లు. ఇన్నింగ్స్ చివరలో వెల్చ్ నిక్ 9 బంతుల్లో 24 రన్స్ చేశాడు. జోబర్గ్ బౌలర్లు రవి బొపారా, సీజే డాల తలో రెండు వికెట్స్ పడగట్టారు.
Also Read
- Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
- Third Front: దేశంలో ‘‘థర్డ్ ఫ్రంట్’’.. కనిమొళి వరస భేటీలతో కొత్త చర్చ..
- Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
- Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
Also Read: IND vs WI 2nd ODI: విండీస్‌తో రెండో వన్డే.. సిరీస్‌పై భారత్ గురి! సంజూకు మరోసారి నిరాశే
141 పరుగుల లక్ష్య చేధనలో జోబర్గ్ బఫ్పాలోస్ జట్టు 57 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ సమయంలో జోబర్గ్ టీమ్‌ను యూసఫ్ పఠాన్ ఆదుకున్నాడు. ముష్ఫికర్ రహీమ్ (14 నాటౌట్) అండతో జట్టుకు ఊచించని విజయాన్ని అందించాడు. జోబర్గ్ విజయానికి చివరి 18 బంతుల్లో 64 పరుగులు అవసరం అయ్యాయి. దాంతో డర్బన్ ఖలాండర్స్ సునాయాసంగా గెలుస్తుందని అందరూ అనుకున్నారు. అయితే యూసఫ్ పఠాన్ సిక్స్‌ల వర్షం కురిపిస్తూ 14 బంతుల్లోనే 61 పరుగులు చేశాడు.
పాకిస్థాన్ మాజీ పేసర్ మహమ్మద్ అమీర్ బౌలింగ్‌ను యూసఫ్ పఠాన్ ఓ ఆటాడుకున్నాడు. అమీర్ వేసిన 6 బంతులను 6,6,0,6,2,4 బాది.. ఏకంగా 24 పరుగులు పిండుకున్నాడు. ఆ తర్వాతి ఓవర్లోనూ విరుచుకుపడ్డాడు. పఠాన్ సునామీ ఇన్నింగ్స్‌తో జోబర్గ్ బఫ్పాలోస్ జట్టు 9.5 ఓవర్లలో 4 వికెట్లకు 142 పరుగులు చేసి గెలుపొందింది. యూసఫ్ తన ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు, 9 సిక్స్‌లు బాదడం విశేషం. మొత్తంగా 26 బంతుల్లో 80 రన్స్ చేశాడు. యూసఫ్ విధ్వంసానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
Also Read: Gold Today Price: పసిడి ప్రియులకు శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం ధరలు!
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్‌లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్‌న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!