Nellore: నెల్లూరు జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఇందుకూరుపేట మండలం మైపాడు బీచ్‌లో సరదాగా ఈతకు వెళ్లిన ముగ్గురు ఇంటర్మీడియట్ విద్యార్థులు సముద్రంలో గల్లంతై మరణించారు. ఆదివారం సెలవు కావడంతో ఈతకు వెళ్లి విగత జీవులుగా మారిన ఈ ఘటన స్థానికంగా విషాదం మిగిలించింది. ఈరోజు (ఆదివారం) మధ్యాహ్నం సుమారు 1:30 గంటల సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. నెల్లూరు నగరంలోని కోటమిట్ట, నారాయణరెడ్డిపేట ప్రాంతాలకు చెందిన ముగ్గురు యువకులు మైపాడు బీచ్‌కు చేరుకున్నారు. వీరంతా ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు.
IND vs SA: వాషింగ్టన్ సుందర్ మెరుపులు.. ఆసీస్ పై భారత్ ఘన విజయం..!
ఈత కోసం సముద్రంలోకి వెళ్లిన యువకులు అలల ఉధృతికి లోనై గల్లంతయ్యారు. విషయం తెలుసుకున్న మెరైన్ పోలీసులు తక్షణమే గాలింపు చర్యలు చేపట్టారు. గాలింపు అనంతరం ముగ్గురు విద్యార్థుల మృతదేహాలను మెరైన్ పోలీసులు సముద్రం నుంచి వెలికితీశారు. పోలీసులు మృతులను ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులుగా గుర్తించారు. బీచ్‌లో గల్లంతై మరణించిన ముగ్గురు విద్యార్థులను పోలీసులు గుర్తించారు. వీరంతా 17 సంవత్సరాల వయస్సు గల ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం చదువుతున్న యువకులు. పఠాన్ మహమ్మద్ తజీమ్.. ఇతను రహ్మత్ కుమారుడు. ఆ అబ్బాయి నారాయణరెడ్డిపేట గ్రామానికి చెందినవాడు. రెండవ విద్యార్థి పఠాన్ హుమాయున్ (సమీద్). ఇతను నయాబ్ రసూల్ కుమారుడు. అబ్బాయి నెల్లూరు నగరంలోని కోటమిట్ట నివాసి. ఇక మూడవ విద్యార్థి ఆదిల్ కూడా కోటమిట్ట, నెల్లూరు నగరానికి చెందినవాడే. ఈ ముగ్గురూ కలిసి ఆదివారం సరదాగా ఈత కోసం మైపాడు బీచ్‌కు వెళ్లగా ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.
Womens World Cup Final 2025: గెలుపే టార్గెట్.. మొదట బ్యాటింగ్ చేయనున్న టీమిండియా..!