IND vs SA: వాషింగ్టన్ సుందర్ మెరుపులు.. ఆసీస్ పై భారత్ ఘన విజయం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND vs SA: హోబార్ట్ వేదికగా జరిగిన భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడో టీ20 మ్యాచ్‌లో భారత జట్టు అద్భుత విజయం సాధించింది. టార్గెట్ 187 పరుగులను భారత్ 18.3 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి పూర్తి చేసి మ్యాచ్‌ను 5 వికెట్ల తేడాతో గెలుచుకుంది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంపిక చేసుకుంది. ప్రారంభంలో అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌తో భారత బౌలర్లు దూకుడు ప్రదర్శించారు. మొదటి మూడు వికెట్లు తక్కువ స్కోరుకే కోల్పోయిన ఆస్ట్రేలియా.. ఆ తరువాత టిమ్ డేవిడ్ (74 పరుగులు), మార్కస్ స్టాయినిస్ (64 పరుగులు) జట్టుకు భారీ స్కోర్ ను అందించారు. చివర్లో మాథ్యూ షార్ట్ (26 నాటౌట్) వేగంగా ఆడడంతో ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 186/6 పరుగులు చేసింది. ఇక భారత్ తరఫున అర్ష్‌దీప్ సింగ్ 3 వికెట్లు, వరుణ్ చక్రవర్తి 2 వికెట్లు తీసి ఆస్ట్రేలియా పరుగుల ప్రవాహాన్ని కొంతవరకు అడ్డుకున్నారు.
Womens World Cup Final 2025: గెలుపే టార్గెట్.. మొదట బ్యాటింగ్ చేయనున్న టీమిండియా..!
Also Read
- Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
- 200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
- Global Fuel Crisis: అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్‌లో రికార్డ్ స్థాయికి చేరిన డీజిల్, పెట్రోల్ ధరలు.. నెక్ట్స్ భారత్ వంతేనా?
- Girls Hair Cutting: నిద్రలో ఉండగా జడలు కత్తిరింపు.. భీమిలి కేజీబీవీలో కలకలం
187 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ప్రారంభంలో కొంత ఒత్తిడిని ఎదుర్కొంది. అభిషేక్ శర్మ (25), శుభ్‌మన్ గిల్ (15), సూర్యకుమార్ యాదవ్ (24) ఇన్నింగ్స్‌లతో జట్టు రన్‌రేట్‌ను స్థిరంగా ఉంచారు. అయితే మధ్యలో తిలక్ వర్మ (29), అక్షర్ పటేల్ (17) ఔటయ్యాక మ్యాచ్ సమీకరణ కఠినమైంది. అయితే చివర్లో ఎవరు ఊహించని విధంగా వాషింగ్టన్ సుందర్ రెచ్చిపోయాడు. సుందర్ 23 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 49 పరుగులకు నాటౌట్ గా నిలిచాడు. ఇక అతడికి తోడుగా.. జితేశ్ శర్మ (22 నాటౌట్) మంచి సహకారం అందించడంతో అద్భుత భాగస్వామ్యం కారణంగా మ్యాచ్‌ను భారత్ వైపు తిప్పేశారు. వీరిద్దరూ 43 బంతుల్లో 58 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పారు. ఇక ఆస్ట్రేలియా తరఫున నాథన్ ఎలిస్ 3 వికెట్లు తీశాడు. ఇక ఈ ఐదు టి20 సిరీస్ లో భాగంగా మొదటి మ్యాచ్ పూర్తిగా వర్షం కారణంగా రద్దు రావడంతో.. రెండో మ్యాచ్ ఆస్ట్రేలియా గెలవగా, ఇప్పుడు మూడో మ్యాచ్ టీమిండియా గెలవడంతో సిరీస్ 1-1 తో సమమయ్యింది. నాలుగో టి20 నవంబర్ 6న జరగనుంది.
Australia vs India 3rd T20I: టిమ్ డేవిడ్, స్టోయినిస్ దూకుడు.. టీమిండియా ముందు భారీ టార్గెట్..!
తాజావార్తలు
-
Itlu Arjuna Teaser: మాటల్లేవ్… మాట్లాడుకోవడాలు లేవ్… డైలాగ్స్ లేకుండానే అనీష్ నటన అదుర్స్..
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
Raptee.HV T30: రాప్టీ.హెచ్‌వి T30 ఎలక్ట్రిక్ బైక్.. 150KM రియల్ రేంజ్, కారు ఛార్జర్‌తో ఛార్జింగ్!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Global Fuel Crisis: అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్‌లో రికార్డ్ స్థాయికి చేరిన డీజిల్, పెట్రోల్ ధరలు.. నెక్ట్స్ భారత్ వంతేనా?
ట్రెండింగ్
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!