Nellore: నెల్లూరు జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఇందుకూరుపేట మండలం మైపాడు బీచ్‌లో సరదాగా ఈతకు వెళ్లిన ముగ్గురు ఇంటర్మీడియట్ విద్యార్థులు సముద్రంలో గల్లంతై మరణించారు. ఆదివారం సెలవు కావడంతో ఈతకు వెళ్లి విగత జీవులుగా మారిన ఈ ఘటన స్థానికంగా విషాదం మిగిలించింది. ఈరోజు (ఆదివారం) మధ్యాహ్నం సుమారు 1:30 గంటల సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. నెల్లూరు నగరంలోని కోటమిట్ట, నారాయణరెడ్డిపేట ప్రాంతాలకు చెందిన ముగ్గురు యువకులు మైపాడు బీచ్‌కు చేరుకున్నారు. వీరంతా ఇంటర్మీడియట్…