సిద్దూ జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా తెరకెక్కిన బ్లాక్ బస్టర్ మూవీ డీజే టిల్లు. ఈ సినిమా భారీ విజయం సాధించింది. చిన్న సినిమాగా వచ్చి అదిరిపోయే హిట్ అందుకుంది.ఈ సినిమాలో నేహా శెట్టి చేసిన రాధిక క్యారెక్టర్ ఎంతో ఫేమస్ అయింది. ఎంతలా అంటే సినిమా రిలీజ్ అయిన దగ్గర నుంచి నేహశెట్టిని అందరూ రాధిక అనే పిలుస్తున్నారు. డీజే టిల్లు సూపర్ హిట్ కావడంతో ఆ సినిమాకు సీక్వెల్ కూడా అనౌన్స్ చేశారు మేకర్స్.. టిల్లు స్క్వేర్ పేరుతో ఈ సినిమా తెరకెక్కుతుంది.అయితే టిల్లు స్క్వేర్ లో మాత్రం హీరోయిన్ ని మార్చేశారు చిత్ర యూనిట్.. డీజే టిల్లులో బాగా ఫేమస్ అయిన నేహశెట్టిని తీసుకోకుండా ఈ సీక్వెల్ లో అనుపమ పరమేశ్వరన్ ని హీరోయిన్ గా తీసుకున్నారు. ఈ విషయంలో మాత్రం అభిమానులు కాస్త నిరాశకు గురయ్యారు. రాధిక క్యారెక్టర్ వల్లే డీజే టిల్లు సినిమా సూపర్ హిట్ అయింది. ఇప్పుడు సీక్వెల్ లో ఆమెని పక్కన పెట్టేశారు అని సోషల్ మీడియాలో తెగ కామెంట్స్ చేశారు.
తాజాగా టిల్లు స్క్వేర్ సినిమాలో తనని తీసుకోకపోవడంపై నేహశెట్టి స్పందించింది. రూల్స్ రంజన్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో నేహశెట్టి ఆ విషయం గురించి మాట్లాడింది.నేహశెట్టి మాట్లాడుతూ.. డీజే టిల్లు సినిమాలో రాధిక పాత్ర తో నాకు మంచి గుర్తింపు వచ్చింది. టిల్లు స్క్వేర్ సినిమా విషయంలో మూవీ యూనిట్ మొదటి నుంచి ఎంతో క్లారిటీగా ఉన్నారు. డీజే టిల్లు సినిమాకు ఇది కొనసాగింపు కథ కాదు. ఇది ఇంకో కొత్త కథ అని ఆమె తెలిపింది.. అందుకే నన్ను హీరోయిన్ గా ఆ సినిమాలో తీసుకోలేదు. ఆ కథకి, ఈ కథకి అస్సలు సంబంధం లేదు అందుకే కంటిన్యూ క్యారెక్టర్ ఉండదు కాబట్టే నన్ను టిల్లు స్క్వేర్ లో తీసుకోలేదు. కానీ ఈ విషయంలో చాలా మంది ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు. నన్ను వెళ్లి మూవీ యూనిట్ ని అడగమని ఎన్నో మెసేజ్ లు కూడా చేశారు అని నేహా శెట్టి తెలిపింది.ప్రస్తుతం ఈ భామ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.