Site icon NTV Telugu

Neha Bhandari: బార్డర్‌లో పాక్ సైన్యానికి ఎదురొడ్డి పోరాడిన వీర వనిత..

Neha Bhandari1

Neha Bhandari1

పహల్గాం ఉగ్ర దాడులకు ప్రతీకారంగా భారత్.. ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. పాకిస్థాన్, పీఓకేలోని ఉగ్ర స్థావరాలే లక్ష్యంగా దాడి చేసింది. 25 నిమిషాల్లోనే ఆపరేషన్‌ని ముగించుకుని వెనుదిరిగింది ఇండియన్ ఆర్మీ. ఆపరేషన్ సిందూర్ గురించి భారత సైన్యం ఇచ్చిన ప్రెస్ బ్రీఫింగ్‌లో ఇద్దరు మహిళా అధికారులు కూడా ఉన్నారు. ఇందులో ఒకరి పేరు సోఫియా ఖురేషి కాగా మరొకరి పేరు వ్యోమికా సింగ్. సోఫియా ఖురేషి భారత సైన్యంలో సిగ్నల్స్ కార్ప్స్‌కు చెందిన అధికారిణి. లెఫ్టినెంట్ కల్నల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఇక వ్యోమికా సింగ్ భారత వైమానిక దళంలో వింగ్ కమాండర్. వీరి ధైర్య సాహసాల గురించి అందరం చదివాం. అదే స్థాయిలో మరో కమాండర్ కూడా ఉన్నారు.

READ MORE: Top Headlines @5PM : టాప్‌ న్యూస్‌

అత్యంత సమీపంలో శత్రువులు ఉన్నా.. ముప్పు ముంచుకు వస్తున్నా.. అస్సలు బెదరలేదు. ఆమె ఎవరో కాదు. అంతర్జాతీయ సరిహద్దుల్లో ఒక బోర్డర్‌ అవుట్‌పోస్ట్‌ను కమాండ్‌ చేసిన ఏకైక మహిళా బీఎస్‌ఎఫ్‌ అధికారిణి నేహా భండారి. ఆపరేషన్‌ సిందూర్‌ వేళ ఆమె చూపిన ధైర్య సాహసాలు అంతా ఇంతా కాదు.. ఉత్తరాఖండ్‌కు చెందిన నేహా భండారి ధైర్యం అసమాన్యం. ఆమె తాత కూడా ఆర్మీలో పని చేశాడు. తండ్రి సైతం సీఆర్పీఎఫ్‌లో పని చేసి పదవీవివరణ పొందారు. వారి వారసత్వంగా దేశ రక్షణ కోసం 2022లో సరిహద్దు భద్రతా దళంలో చేరింది నేహా. ఈమే ప్రస్తుతం జమ్మూలోని అఖ్నూర్‌ సెక్టార్‌లో అంతర్జాతీయ సరిహద్దు వెంబడి పోస్ట్‌లో అసిస్టెంట్‌ కమాండెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.

READ MORE: Perni Nani: థియేటర్ల బంద్ గురించి ఒక ప్రొడ్యూసర్ చెప్పేదాకా ప్రభుత్వానికి తెలియదా..?

నేహా విధులు నిర్వర్తిస్తున్న పోస్ట్‌కు కేవలం 150 మీటర్ల దూరంలోనే పాకిస్థానీ పోస్టు ఉంది. ఏప్రిల్‌ 22న పహల్గాం ఉగ్రదాడి తర్వాత నుంచే ఈ ప్రదేశంలో కాల్పులు మొదలయ్యాయి. నేహా మరో ఆరుగురు మహిళా కానిస్టేబుళ్ల బృందంతో కలిసి శత్రు దాడిని తిప్పికొట్టారు. తాజాగా ఆమె ఓ మీడియా సంస్థతో తన అనుభవాలను పంచుకున్నారు. ఎంత క్లిష్టమైన పరిస్థితుల్లో విధులు నిర్వహించినప్పటికీ గర్వంగా ఉందని చెప్పారు. తన ఆధ్వర్యంలో మూడు పోస్టులు ఉన్నాయని.. తన సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ పాక్ దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టినట్లు తెలిపారు.

READ MORE: Perni Nani: థియేటర్ల బంద్ గురించి ఒక ప్రొడ్యూసర్ చెప్పేదాకా ప్రభుత్వానికి తెలియదా..?

శత్రు సైన్యం స్థావరాలను లక్ష్యంగా చేసుకుని అందుబాటులో ఉన్న అన్ని ఆయుధాలను ఉపయోగించి దాడులు చేసినట్లు వెల్లడించారు. పురుష సిబ్బందితో పోలిస్తే మహిళలు ఏమాత్రం తక్కువ కాదని నిరూపించినట్లు నేహా తెలిపారు. తనతోపాటు మరో 18-19 మహిళా బోర్డర్‌ గార్డులు ఉన్నారని… ఇందులో ఆరుగురు గన్‌ పొజిషన్లలో ఉంటూ శత్రు దాడిని నేరుగా ఎదుర్కొన్నట్లు స్పష్టం చేశారు. పాక్‌ వైపు నుంచి వస్తున్న డ్రోన్లు, మోర్టార్‌ షెల్స్‌ను తాము సమర్థంగా కూల్చేసినట్లు గర్వంగా తెలిపారు.

Exit mobile version