పహల్గాం ఉగ్ర దాడులకు ప్రతీకారంగా భారత్.. ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. పాకిస్థాన్, పీఓకేలోని ఉగ్ర స్థావరాలే లక్ష్యంగా దాడి చేసింది. 25 నిమిషాల్లోనే ఆపరేషన్‌ని ముగించుకుని వెనుదిరిగింది ఇండియన్ ఆర్మీ. ఆపరేషన్ సిందూర్ గురించి భారత సైన్యం ఇచ్చిన ప్రెస్ బ్రీఫింగ్‌లో ఇద్దరు మహిళా అధికారులు కూడా ఉన్నారు.
ఈ రోజు పాక్ కాల్పుల్లో మరో జవాన్ వీరమరణం పొందారు.. జమ్మూలో పాక్ జరిపిన కాల్పుల్లో జవాన్ సచిన్ యాదవ్‌రావు వనాంజే ప్రాణాలు విడిచారు.. సచిన్ యాదవ్ రావు వనాంజే వయస్సు 29 ఏళ్లు.. ఆయన స్వస్థలం మహారాష్ట్ర - తెలంగాణ బార్డర్‌లోని నాందేడ్ జిల్లా తమ్లూర్... సచిన్ యాదవ్‌రావు వనాంజే మృతితో తమ్లూర్‌లో విషాదచాయలు అలుముకున్నాయి..
భారత్-పాకిస్తాన్ యుద్ధంలో తెలుగు జవాన్ వీరమరణం పొందాడు.. జమ్మూ కాశ్మీర్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జవాన్ మురళీ నాయక్ ప్రాణాలు విడిచారు.. పాకిస్థాన్ జరిపిన కాల్పుల్లో మృతి చెందాడు జవాన్ మురళీ నాయక్.. ఆయన స్వస్థలం ఏపీలోని సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితండా.. రేపు కల్లితండాకు మురళీ నాయక్ పార్థివదేహాన్ని తరలించేందుకు భారత ఆర్మీ ఏర్పాట్లు చేసింది..
జమ్మూ కశ్మీర్‌లోని సాంబాలో ఒక పెద్ద చొరబాటు ప్రయత్నాన్ని బీఎస్‌ఎఫ్ భగ్నం చేసింది. ఎల్‌ఓసీలోని కొన్ని ప్రాంతాల్లో పాకిస్థాన్ వైపు నుంచి పెద్ద ఎత్తు కాల్పులు జరుగుతున్నాయి. భారత ఆర్మీ తగిన సమాధానం ఇస్తోంది. అయితే.. భారత్‌లో అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించిన ఆర్మీని పాక్ అడ్డుకుంది. అర్ధరాత్రి జమ్మూ కశ్మీర్‌లోని నియంత్రణ రేఖ (LOC) దగ్గర పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. ఆ ప్రాంతమంతా చీకటి అలుముకుంది.