పహల్గాం ఉగ్ర దాడులకు ప్రతీకారంగా భారత్.. ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. పాకిస్థాన్, పీఓకేలోని ఉగ్ర స్థావరాలే లక్ష్యంగా దాడి చేసింది. 25 నిమిషాల్లోనే ఆపరేషన్‌ని ముగించుకుని వెనుదిరిగింది ఇండియన్ ఆర్మీ. ఆపరేషన్ సిందూర్ గురించి భారత సైన్యం ఇచ్చిన ప్రెస్ బ్రీఫింగ్‌లో ఇద్దరు మహిళా అధికారులు కూడా ఉన్నారు.
పహల్గామ్‌లో క్రూరమైన ఉగ్రవాద దాడి చేసిన ఉగ్రవాదులను భారత దళాలు ఎంపిక చేసి హతమార్చాయి. మే 6-7 రాత్రి, భారత సాయుధ దళాలు పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌లలో 25 నిమిషాల పాటు దాడి చేసి, తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేశాయి. ఉగ్రవాద నెట్‌వర్క్ వెన్నెముకను విచ్ఛిన్నం చేశాయి. ఈ అంశంపై తాజాగా భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మీడియాతో మాట్లాడారు. భారత్ ఎవరిని లక్ష్యంగా చేసుకుందో తెలిపారు. అమాయకుల ప్రాణాలు తీసిన వారు…
Mahindra's Armado: దేశీయ దిగ్గజ కార్ మేకర్ మహీంద్ర ఇండియా సాయుధ దళాల కోసం ప్రత్యేకంగా ఓ వాహనాన్ని రూపొందించింది. ఆర్మర్డ్ లైట్ స్పెషలిస్ట్ వెహికల్ (ALSV) ‘ఆర్మడో’ డెలివరీని ప్రారంభించినట్లు మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా ప్రకటించారు. మహీంద్రా డిఫెన్స్ సిస్టమ్స్(MDS) పేరుతో పూర్తి దేశీయ టెక్నాలజీతో మహీంద్రా గ్రూప్ ఈ వాహనాలను తయారు చేస్తోంది.