పహల్గాం ఉగ్ర దాడులకు ప్రతీకారంగా భారత్.. ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. పాకిస్థాన్, పీఓకేలోని ఉగ్ర స్థావరాలే లక్ష్యంగా దాడి చేసింది. 25 నిమిషాల్లోనే ఆపరేషన్‌ని ముగించుకుని వెనుదిరిగింది ఇండియన్ ఆర్మీ. ఆపరేషన్ సిందూర్ గురించి భారత సైన్యం ఇచ్చిన ప్రెస్ బ్రీఫింగ్‌లో ఇద్దరు మహిళా అధికారులు కూడా ఉన్నారు.
పాకిస్థాన్ సరిహద్దు రాష్ట్రాలలో గురువారం సాయంత్రం మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు. ఈ మాక్ డ్రిల్ గుజరాత్, పంజాబ్, రాజస్థాన్, జమ్మూ కశ్మీర్‌లలో జరుగుతుంది. పాకిస్థాన్ సరిహద్దులో ఉన్న ఈ నాలుగు రాష్ట్రాలలో ప్రభుత్వం మాక్ డ్రిల్‌లను ఆదేశించింది. దీంతో భారత సైన్యం ఏదైనా కీలక నిర్ణయం తీసుకుంటుందా?
Pahalgam Terror attack: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధమేఘాలు అలుముకున్నాయి. ఈ నేపథ్యంలో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్ఎఫ్) సరిహద్దుల్లోని రైతులకు కీలక ఆదేశాలు ఇవ్వడం సంచలనంగా మారింది. సరిహద్దు వెంబడి ఉన్న రైతులు 48 గంటల్లో పంట కోత పూర్తి చేసి తమ పొలాలను ఖాళీ చేయాలని శనివారం బీఎస్ఎఫ్ అత్యవసర ఆదేశాలు జారీ చేసింది.