NCRB 2023 Crime Report: దేశంలో నకిలీ కరెన్సీ దందా జోరుగా సాగుతుందని NCRB సంచలన రిపోర్ట్ వెల్లడించింది. ఇందులో మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ దందా దేశ రాజధాని ఢిల్లీలో అత్యధికంగా ఉందని పేర్కొంది. నకిలీ నోట్లను ముద్రించే నేరస్థులు వారి అక్రమ వ్యాపారాన్ని నిర్వహించడానికి అనువైన ప్రాంతంగా దేశ రాజధానిని ఎంచుకున్నారని తాజా నివేదిక చెబుతుంది. దేశ రాజధానిలో వృద్ధి చెందుతున్న నకిలీ కరెన్సీ వ్యాపారం తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. ఎన్‌సీఆర్‌బీ రిపోర్ట్‌లో ఏ రాష్ట్రం ఏ ప్లేస్‌లో ఉందో ఈ స్టోరీలో తెలుసుకుందాం..
READ ALSO: GOA: ఎవర్రా మీరంతా.. ఇంత టాలెంట్ గా ఉన్నారు.. విమానం లేట్ అయితే ఇలా చేస్తారా..
నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) తన 2023 నివేదికను తాజాగా విడుదల చేసింది. ఈ నివేదికలో 2023లో దేశవ్యాప్తంగా ₹16.86 కోట్ల విలువైన మొత్తం 351,656 నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది. అత్యధిక సంఖ్యలో నకిలీ కరెన్సీ కేసులు ఢిల్లీలో నమోదయ్యాయని వెల్లడించింది. ఈ కేసులు ప్రధానంగా రూ.2 వేల నోట్లతో సంబంధం కలిగి ఉన్నాయి. తర్వాతి స్థానాల్లో రాజస్థాన్, అస్సాం, ఉత్తరప్రదేశ్‌లు వరుసగా ఉన్నాయి. నకిలీ కరెన్సీ కేసులో అస్సాం, రాజస్థాన్ రెండవ స్థానంలో ఉన్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లో అత్యధికంగా నకిలీ రూ.500 నోట్లను నిఘా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ రాష్ట్రంలో రూ.1.86 కోట్ల విలువైన 37,240 నకిలీ నోట్లను స్వాధీనం చేసుకుంది. రాజస్థాన్‌లో సుమారుగా రూ.1.9 కోట్ల విలువైన 38,087 నకిలీ రూ.500 నోట్లను సీజ్ చేశారు.
ఎక్కడెక్కడ నకిలీ నోట్లు సీజ్ చేశారంటే..
20, 50, 100, 200 వంటి తక్కువ విలువ కలిగిన నకిలీ నోట్ల స్వాధీనంలో ఉత్తరప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. ఈ రాష్ట్రంలో రూ.13.11 లక్షల విలువైన 6,558 నకిలీ రూ.200 నోట్లు స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటకలో 4,903 నకిలీ నోట్లు, రాజస్థాన్‌లో 3,593 నకిలీ నోట్లు సీజ్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లో స్వాధీనం చేసుకున్న 12,068 నకిలీ నోట్ల విలువ రూ.6.3 లక్షలు, ఢిల్లీలో స్వాధీనం చేసుకున్న 3,027 నకిలీ నోట్ల కంటే వీటి విలువ నాలుగు రెట్లు ఎక్కువ. మహారాష్ట్రలో 1,457 నకిలీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు.
రైల్వే దొంగతనాల కేసుల్లో మహారాష్ట్ర నంబర్ 1..
NCRB తాజా నివేదిక ప్రకారం.. రైల్వే దొంగతన కేసుల జాబితాలో మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉంది. 2023లో కేవలం ఈ రాష్ట్రంలో మాత్రమే 22,157 రైల్వే దొంగతనాల కేసులు నమోదయ్యాయి. హర్యానాలో 1,085, మధ్యప్రదేశ్‌లో 10,561, ఉత్తరప్రదేశ్‌లో 4,672, బీహార్‌లో 3,240, గుజరాత్‌లో 2,249 కేసులు నమోదయ్యాయి. పంజాబ్‌లో అత్యల్పంగా 201 రైల్వే దొంగతన కేసులు నమోదయ్యాయి.
ఆన్‌లైన్ మోసాల కేసుల్లో ముంబై టాప్..
ఆన్‌లైన్ మోసాల విషయంలో 19 మెట్రో నగరాల్లో మహారాష్ట్రలోని ముంబై టాప్ ప్లేస్‌లో ఉంది. 2023లో ఈ ప్రాంతంలో 2,396 ఆన్‌లైన్ చీటింగ్ కేసులు నమోదయ్యాయి. అలాగే 45 ఆన్‌లైన్ డాక్యుమెంట్ మోసం కేసులు నమోదయ్యాయి. మహిళలు, పిల్లల సైబర్ స్టాకింగ్‌లో ముంబైను బీట్ చేసి హైదరాబాద్ టాప్ ప్లేస్‌లోకి వచ్చింది. ముంబై 119 కేసులతో రెండవ స్థానంలో ఉండగా, హైదరాబాద్ 163 కేసులతో మొదటి స్థానంలో ఉంది. ఇంటర్నెట్ లైంగిక వేధింపుల కేసుల జాబితాలో బెంగళూరు 374 కేసులతో అగ్రస్థానంలో నిలిచింది. ముంబై 179 కేసులతో సెకండ్ ప్లేస్‌లో ఉంది.
మహిళలపై అత్యధికంగా దాడులు జరిగే రాష్ట్రాల్లో అగ్రస్థానంలో ఒడిశా..
2023లో మహిళలపై జరిగిన దాడుల జాబితాలో ఒడిశా అగ్రస్థానంలో ఉంది. ఈ రాష్ట్రంలో మహిళలు సరైన దుస్తులు ధరించాలనే ఉద్దేశ్యంతో పాటు, నేరపూరిత బలప్రయోగం వంటి సంఘటనలు అత్యధికంగా నమోదైనట్లు నివేదిక పేర్కొంది. రాష్ట్రంలో ఐపీసీ సెక్షన్ 354బి కింద 1,978 కేసులు నమోదు కాగా, ఉత్తరప్రదేశ్‌లో 1,750 కేసులు నమోదయ్యాయి. మహిళల అణకువను దెబ్బతీసే ఉద్దేశ్యంతో వారిపై జరిగిన దాడుల్లో కూడా రాజస్థాన్ టాప్ ప్లేస్‌లో ఉంది. 2023లో ఐపీసీ సెక్షన్ 354బి కింద రాజస్థాన్‌లో అత్యధికంగా 6,758 కేసులు నమోదయ్యాయి. తర్వాతి స్థానంలో ఒడిశా 5,937 కేసులతో ఉంది.
READ ALSO: US Government Shutdown 2025: అమెరికాలో సంక్షోభం.. షట్ డౌన్ తర్వాత యూఎస్‌లో ఏం జరగబోతుంది..