నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్ అంటేనే బాక్సాఫీస్ వద్ద మాస్ జాతర మొదలైనట్లే. ‘వీరసింహా రెడ్డి’ వంటి భారీ హిట్ తర్వాత వీరిద్దరి కలయికలో రాబోతున్న 111వ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. అయితే, ఈ సినిమా షూటింగ్ విషయంలో గత కొద్దిరోజులుగా జరుగుతున్న సస్పెన్స్‌కు ఇప్పుడు తెరపడింది. మొదట ఈ ప్రాజెక్ట్‌ను సుమారు రూ.170 కోట్ల భారీ బడ్జెట్‌తో ఒక చారిత్రక (పీరియాడికల్) నేపథ్యం ఉన్న కథతో చేయాలనుకున్నారు. కానీ, ప్రస్తుతం మారిన మార్కెట్ పరిస్థితులు, బడ్జెట్ లెక్కల దృష్ట్యా ఆ కథను పక్కన పెట్టి, బాలయ్య ఇమేజ్‌కు సరిపోయే పక్కా మాస్ యాక్షన్ కథను గోపీచంద్ సిద్ధం చేశారు.
Also Read : Rimi Sen : తనకి నటన రాదు.. కేవలం బాడీతోనే నెట్టుకొస్తున్నాడు- జాన్ అబ్రహంపై రిమీ సేన్ షాకింగ్ కామెంట్స్
ఇటీవలే దర్శకుడు వినిపించిన ఈ కొత్త కథకు బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో, వచ్చే మార్చి నెల నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ ‘వృద్ధి సినిమాస్’ ధృవీకరించింది. తొలి షెడ్యూల్లోనే బాలయ్య మార్క్ అదిరిపోయే యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇక హీరోయిన్ విషయానికి వస్తే, పాత కథ ప్రకారం నయనతారను ఎంపిక చేసినప్పటికీ, ఇప్పుడు కథ మారడంతో ఆమెనే కొనసాగిస్తారా లేక కొత్త హీరోయిన్ను తీసుకుంటారా అనే దానిపై సస్పెన్స్ నెలకొంది. ఏదేమైనా, బాలయ్య మార్క్ పవర్ఫుల్ డైలాగులు, గోపీచంద్ టేకింగ్ కలిసి మరోసారి బాక్సాఫీస్ వద్ద రికార్డులను తిరగరాయడం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.