నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్ అంటేనే బాక్సాఫీస్ వద్ద మాస్ జాతర మొదలైనట్లే. ‘వీరసింహా రెడ్డి’ వంటి భారీ హిట్ తర్వాత వీరిద్దరి కలయికలో రాబోతున్న 111వ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. అయితే, ఈ సినిమా షూటింగ్ విషయంలో గత కొద్దిరోజులుగా జరుగుతున్న సస్పెన్స్‌కు ఇప్పుడు తెరపడింది. మొదట ఈ ప్రాజెక్ట్‌ను సుమారు రూ.170 కోట్ల భారీ బడ్జెట్‌తో ఒక చారిత్రక (పీరియాడికల్) నేపథ్యం ఉన్న కథతో చేయాలనుకున్నారు. కానీ, ప్రస్తుతం మారిన మార్కెట్…