IRCTC Special Navratri Menu: నవరాత్రి సమయంలో ఉపవాసం ఉంటూ రైళ్లలో ప్రయాణించే ప్రయాణికులకు ఇండియన్ రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. ఉపవాసం ఉండే వారి కోసం ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) స్పెషల్ మెనూను ప్రవేశపెట్టింది. ఈ స్పెషల్ మెనూ ద్వారా రైల్వేలు ప్రయాణీకులకు సాత్విక్, పండ్ల ఆధారిత భోజనం రెండింటినీ అందించే సౌకర్యాన్ని ప్రవేశపెట్టినట్లు తెలిపింది.
READ ALSO: Kantara Chapter 1: బాప్‌రే.. 7 వేల స్క్రీన్‌లలో ‘కాంతార: చాప్టర్1’ రిలీజ్!
మెనూ స్పెషల్ ఏంటంటే..
సాత్విక్ డైట్ మెనూలో సాగో నుంచి రాక్ సాల్ట్ వరకు అన్ని రకాల వంటకాలు ఉంటాయి. జీరా బంగాళాదుంపలు, బంగాళాదుంప టిక్కీలు, సాగో కిచిడి, సాగో వడ, మలై బర్ఫీ, లస్సీ, ఎండిన మఖానా, ఉపవాస కూరగాయలు, వేరుశెనగ ఉప్పు సాదా పెరుగు ఇందులో ఉంటాయి. ఈ స్పెషల్ మెనూ కోసం IRCTC ఈ-క్యాటరింగ్ వెబ్‌సైట్ లేదా యాప్‌లో బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ చెల్లింపు, పే-ఆన్-డెలివరీ ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. ఆర్డర్ చేసిన తర్వాత ప్రయాణీకులు సంబంధిత స్టేషన్‌లోని వారి బెర్త్‌లలో వారి భోజనాన్ని అందుకుంటారు. ఈ సాత్విక్ థాలిల ధర రూ.100 నుంచి రూ.200 మధ్య ఉంది.
వందే భారత్‌లో వన్ లీటరు వాటర్ బాటిల్..
గతంలో వందే భారత్ రైల్‌లో ప్రయాణికులకు 500 మి.లీ. వాటర్ బాటిల్స్ అందించే వారు. ఈక్రమంలో ప్రయాణికులకు ఒక లీటర్ వాటర్ బాటిల్ అందించాలని రైల్వే బోర్డు అన్ని జోనల్ రైల్వేలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ కొత్త ఉత్తర్వుల నేపథ్యంలో అన్ని వందే భారత్ రైళ్లలో ప్రయాణికులకు ఒక లీటరు వాటర్ బాటిల్స్ అందుబాటులోకి వచ్చాయి.
READ ALSO: Bangladesh Elections 2026: బంగ్లాదేశ్‌లో ‘కమలం’ పంచాయతీ.. హీట్ పెంచిన పొలిటికల్ ఫైట్