NIA: లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌పై జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) పట్టు బిగించింది. లారెన్స్ సోదరుడు అన్మోల్ బిష్ణోయ్‌పై ఎన్‌ఐఏ ఏకంగా రూ.10 లక్షల రివార్డు ప్రకటించింది. అన్మోల్ బిష్ణోయ్ అలియాస్ భాను పేరు మోసిన గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు. గాయకుడు, రాజకీయ నాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య కేసులో కూడా అతను ప్రధాన నిందితుడు. 2023లో దర్యాప్తు సంస్థ అతనిపై చార్జిషీటు దాఖలు చేసింది. సమాచారం ప్రకారం, అతను నకిలీ పాస్‌పోర్ట్‌తో భారతదేశం నుండి పారిపోయాడు. అన్మోల్ బిష్ణోయ్ ఎప్పటికప్పుడు తన లొకేషన్‌లను మారుస్తూ ఉంటాడు. గత సంవత్సరం కెన్యా, ఈ సంవత్సరం కెనడాలో కనిపించాడు. ఇకపోతే, రికార్డ్స్ లో అన్మోల్ బిష్ణోయ్‌పై 18 క్రిమినల్ కేసులు నమోదైనట్లు సమాచారం. జోధ్‌పూర్ జైలులో శిక్షను అనుభవించాడు కూడా. అన్మోల్ 2021 అక్టోబర్ 7న బెయిల్‌పై విడుదలయ్యాడు.
Read Also: Swag : సర్ ప్రైజ్.. ఓటీటీలోకి వచ్చేసిన శ్రీవిష్ణు లేటెస్ట్ మూవీ స్వాగ్.. ఎక్కడ చూడాలంటే
ఏప్రిల్ 14, 2024న సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఇంటి గెలాక్సీ అపార్ట్‌మెంట్ వెలుపల కాల్పులు జరిగిన సంగతి తెలిసిందే. ఈ కేసును విచారిస్తున్న ముంబై క్రైమ్ బ్రాంచ్, కాల్పుల కేసులో ప్రమేయం ఉన్నందుకు వాంటెడ్ నిందితుడు అన్మోల్ బిష్ణోయ్‌పై లుకౌట్ సర్క్యులర్ (ఎల్‌ఓసి) నోటీసు కూడా జారీ చేసింది. బాబా సిద్ధిఖీ హత్య కేసును దర్యాప్తు చేస్తున్న ముంబై క్రైమ్ బ్రాంచ్ నిందితుడిని విచారించగా.. కాల్పులు జరిపిన వ్యక్తి లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్మోల్ బిష్ణోయ్‌తో ప్రత్యక్ష సంబంధంలో ఉన్నాడని తెలిసింది. హత్యకు పాల్పడినట్లు అనుమానిస్తున్న ముగ్గురు అనుమానితులు హత్యకు ముందు జైలులో ఉన్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్మోల్ బిష్ణోయ్‌తో సోషల్ మీడియా యాప్ స్నాప్ చాట్ ద్వారా సంభాషణలు చేసారు. అన్మోల్ బిష్ణోయ్ ఒక షూటర్, కుట్రదారుడు. అతడు కెనడా, అమెరికాకు చెందిన నిందితులతో కూడా అన్మోల్‌కు పరిచయం ఉంది.
Telangana Tourism: పర్యాటకులకు శుభవార్త.. సోమశిల నుంచి శ్రీశైలం వరకు లాంచీ ప్రయాణ సేవలు..