Andhrapradesh: ఏపీకి జాతీయ ఇంధన పరిరక్షణ అవార్డు.. అధికారులను అభినందించిన సీఎం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Andhrapradesh: ఇంధన పొదుపు, సంరక్షణలో ఏపీ మరోసారి తన సత్తాను నిరూపించుకుంది. ఇంధన భద్రత దిశగా రాష్ట్ర సర్కారు కృషిని గుర్తించిన కేంద్రం.. ప్రతిష్ఠాత్మక జాతీయ ఇంధన పరిరక్షణ అవార్డును అందజేసింది. ఇంధన వినియోగం ఆధారంగా రాష్ట్రాలను నాలుగు గ్రూపులుగా విభజించింది. రెండో గ్రూపులో ఉన్న ఏపీ అత్యుత్తమ పనితీరు కనబరిచి ప్రథమ బహుమతిని సొంతం చేసుకుంది. జాతీయ స్థాయి ర్యాంకింగ్స్లో రెండో స్థానంలో నిలవడం గమనార్హం.
Karumuri Nageswara Rao: బీసీలకు ఏం చేశారో టీడీపీ శ్వేతపత్రం విడుదల చేయాలి..
Also Read
ఏపీ జాతీయ ఇంధన పరిరక్షణ అవార్డు గెలుచుకోవడంపై మంత్రి, అధికారులను సీఎం వైఎస్ జగన్ అభినందించారు. ఇంధన భద్రత దిశగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషిని గుర్తించి ప్రతిష్టాత్మక జాతీయ ఇంధన పరిరక్షణ అవార్డుకు ఏపీని కేంద్రం ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఇటీవల ఢిల్లీలో నిర్వహించిన అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్న అవార్డును సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చూపించారు. ఆయనతో పాటు ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్, ఆంధ్రప్రదేశ్ ఇంధన పరిరక్షణ మిషన్ సీఈవో ఏ.చంద్రశేఖర్ రెడ్డి, ఏపీ ట్రాన్స్కో జేఎండీ ఐ.పృథ్వితేజ్ ఉన్నారు.
తాజావార్తలు
-
Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
-
Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!