NASA : స్పేస్ సెంటర్‌ను కూల్చివేసేందుకు నాసా ప్లాన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రానున్న రోజుల్లో ప్రపంచానికి మరో స్కైలాబ్ నుంచి ముప్పు పొంచి ఉంది. అంతరిక్షంలో ఏళ్లుగా సంచరిస్తున్న ఓ భారీ ప్రయోగశాల పసిఫిక్ మహాసముద్రంలో కూలిపోనున్నట్లు తెలుస్తోంది. దీన్ని సురక్షితంగా భూమిపై కూల్చేందుకు నాసా ప్రయత్నాలు స్టార్ట్ చేసింది. మరో ఎనిమిదేళ్లలో( 2031 ) ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్‌ను అమెరికా కూల్చివేయనుంది. అనేక అంతరిక్ష ప్రయోగాలకు కీలకంగా ఉన్న ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ సమయం ముగిసింది. ఈ స్పేస్ స్టేషన్ బరువు సుమారు 400 టన్నులు.. ఇది దాదాపుగా 200 ఏనుగుల కన్నా బరువుంటుంది. మరి టైమ్ అవుట్ అయిన ఇంత భారీ అంతరిక్ష నిర్మాణాన్ని భూమ్మీదకు ఎలా తీసుకొస్తారన్నదే ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.
Also Read : Minister KTR : ఇనాళ్లు ఏం పీకారు… గుడ్డి గుర్రాల పళ్లు తోమారా
Also Read
- ICC Awards: శుభ్మన్ గిల్, షెఫాలి వర్మలకు అవార్డులు..
- Kitchen Cleaning Tips: కిచెన్లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
- Election Commission: గ్రాడ్యుయేట్ ఓటరు నమోదుకు EPIC నంబర్ అవసరమా? ఎన్నికల కమిషన్ క్లారిటీ
- Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
ఉపగ్రహాలు నిప్పులు చిమ్ముకుంటూ ఆకాశంలోకి వెళ్లడమేకాదు.. అదే స్థాయిలో తిరిగి.. భూ వాతావరణంలోకీ ప్రవేశిస్తాయి. 2031లో ఈ భారీ ప్రయోగశాల ఇలా నిప్పులు చిమ్ముకుంటూ భూ వాతావరణంలోకి ప్రవేశించనుంది. ఇక్కడే అసలు సమస్య వస్తుంది. భూ వాతావరణంలోకి ప్రవేశించిన వెంటనే.. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ పేలిపోకుండా దాన్ని.. జాగ్రత్తగా పసిఫిక్ మహాసముద్రంలో ఎంపికచేసిన ప్రదేశంలో పడేలా చేయడమే ఇప్పడు శాస్త్రవేత్తలకు సవాలుగా మారింది.
Also Read : Cheating : నగ్నంగా కనిపించే కూలింగ్ గ్లాస్ అంటూ మోసం
ఈ స్పేస్ స్టేషన్‌ను భూమ్మీదకు తీసుకొచ్చి.. సముద్రంలో కూలిపోయేలా చేయడానికి కూడా ఓ కారణం ఉంది. ఈ స్పేస్ స్టేషన్‌లో ఉన్న హార్డ్‌వేర్ దశాబ్ధాల కిందటిది.. దీనివల్ల స్పేస్ స్టేషన్ కక్ష్యలో నియంత్రణ కోల్పోయే అవకాశం ఉంది. అందుకే దీన్ని కూల్చివేస్తున్నారు. పసిఫిక్ మహాసముద్రంలో స్పేష్ స్టేషన్ కూలిపోయిన తర్వాత కొన్నివేల కిలోమీటర్ల విస్తీర్ణంలో దాని అవశేషాలు పడే ఛాన్స్ ఉంది. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌ను సురక్షితంగా పసిఫిక్ మహాసముద్రంలో కూల్చివేయగలిగితే.. అది మరో చరిత్రే అన్నది శాస్త్రవేత్తల అభిప్రాయం. ఈ ప్రాజెక్టుకు 8వేల కోట్లు ఖర్చవుతాయని అంచనా వేస్తున్నారు. దీన్ని కూల్చివేయడానికి నిధులు కావాలని అమెరికా కాంగ్రెస్‌ను నాసా ఇప్పటికే వెల్లడించింది.
Also Read : Lal Salaam: మొయిద్దీన్ భాయ్ వస్తున్నాడు.. పక్కకు జరగండమ్మా
భూ వాతావరణంలోకి ప్రవేశించగానే గతంలో రష్యాకు చెందిన మిర్ అంతరిక్ష కేంద్రం, నాసా ప్రయోగించిన స్కైలాబ్ కాలి బూడిదయ్యాయి. మిర్ అంతరిక్ష కేంద్రంతో పోలిస్తే పరిమాణంలో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ చాలా పెద్దదిగా ఉంటుంది. మరి అంత పెద్ద నిర్మాణం కాలిబూడిద కాకుండా.. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరుగకుండా పసిఫిక్ సముద్రంలో పడేలా శాస్ర్తవేత్తలు సుదీర్ఘంగా శ్రమించాల్సి వస్తుంది.
Also Read : CM YS Jagan: సిక్కులకు సీఎం గుడ్‌న్యూస్.. ప్రత్యేక కార్పొరేషన్, మరిన్ని ప్రయోజనాలు..
రష్యా, అమెరికాతో పాటు ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ 12కుపైగా దేశాలు కలిసి దీన్ని నిర్మించాయి. సోవియట్ యూనియన్ పతనం తర్వాత అమెరికా, రష్యా కలిసి ఈ ప్రాజెక్ట్ కోసం పనిచేశాయి. 1998వ సంవత్సరంలో నిర్మితమైన ఈ స్పేస్ సెంటర్ ను ఇప్పటిదాకా 20దేశాలకు చెందిన 250మందికి పైగా వ్యోమగాములు సందర్శించారు. ఇంత చరిత్ర కలిగిన ఈ స్పేస్ సెంటర్ కూల్చివేతలో ఎలాంటి ప్రమాదం జరగకుండా ఉండేలా శాస్త్రవేత్తలు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
తాజావార్తలు
-
ICC Awards: శుభ్మన్ గిల్, షెఫాలి వర్మలకు అవార్డులు..
-
Ramayana Update: ‘రామాయణ’ నుంచి నయా పోస్టర్.. ‘జటాయువు’గా స్టార్ నటుడు!
-
Kitchen Cleaning Tips: కిచెన్లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Election Commission: గ్రాడ్యుయేట్ ఓటరు నమోదుకు EPIC నంబర్ అవసరమా? ఎన్నికల కమిషన్ క్లారిటీ
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
ట్రెండింగ్
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!
-
IND vs WI 4th T20: తుది జట్టులో కీలక మార్పులు.. ఆ ఇద్దరికి షాక్.. హైదరాబాద్ టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Money Plant Care: మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా? ఈ 6 సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
-
Tea Drinking Mistakes: ‘టీ’ తాగడం ఓకే.. కానీ, తాగే సమయలో ఈ తప్పులు చేసారో.. క్యాన్సర్ వచ్చే ప్రమాదం సుమీ..!
-
Jim Jim Taara Song: “జుమ్ జుమ్ తార” అంటే లోకల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్.. మెస్సీ ఫుడ్ బాల్ మ్యాచ్లో తెలుగు జానపద సాంగ్!!