PM Modi: రష్యా చేరుకున్న ప్రధాని మోడీ.. ఘనస్వాగతం

  • రష్యా చేరుకున్న ప్రధాని మోడీ
  • ఘనస్వాగతం పలికిన అధికారులు
Pm Modi

Pm Modi

ప్రధాని మోడీ రష్యా చేరుకున్నారు. ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం తర్వాత తొలిసారి రష్యా గడ్డపై మోడీ అడుగుపెట్టారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం సోమవారం ప్రధాని రష్యాకు బయల్దేరి వెళ్లారు. మాస్కోలో దిగిన ప్రధాని మోడీకి అధికారులు సాదర స్వాగతం పలికారు. రష్యన్‌ డ్యాన్స్‌ బృందం ప్రత్యేకంగా దాండియా, గర్భా నృత్యంతో మోడీకి స్వాగతం పలికారు.

ఇది కూడా చదవండి: Manchu Family: మళ్ళీ బయటపడ్డ విభేదాలు.. పేరు ప్రస్తావించుకోడానికి కూడా ఇష్టపడని మంచు బ్రదర్స్

రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ఆహ్వానం మేరకు మోడీ మాస్కో వెళ్లారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఇరు దేశాధినేతలు వార్షిక శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటారు. రెండు దేశాల మధ్య వాణిజ్య, రక్షణ, ఆర్థిక సహకారంపై ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. ఇక ప్రధాని మోడీ కోసం పుతిన్‌ ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. అలాగే ప్రవాస భారతీయులతో కూడా ప్రధాని ముచ్చటించనున్నారు. ఇక రష్యా పర్యటన అనంతరం మోడీ ఆస్ట్రియా వెళ్లనున్నారు.