సాధారణంగా యూట్యూబ్ ఉన్న ప్రతి ఒక్కరు వీడియో చివరిలో చెప్పే మాట పక్కనే ఉన్న బెల్ బటన్ ను క్లిక్ చేసి మా ఛానల్ ను సబ్‌స్రైబ్ చేయండి అని. ఎంతటి పెద్ద యూట్యూబర్ అయినా ఈ మాట చెప్పాల్సిందే. ఇక దీనికి నేనేమీ అతీతం కాదంటున్నారు ప్రధాని నరేంద్రమోడీ. యూట్యూబ్ ఫ్యాన్ ఫెస్ట్ ఇండియా 2023 కార్యక్రమంలో భాగంగా మోదీ 5 వేల కంటెన్ట్ క్రియేటర్లను ఉద్దేశించి మాట్లాడారు. తాను కూడా ఓ కంటెన్ట్ క్రియేటర్ గా ఉన్నందుకు చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నారు ప్రధాని మోడీ. గత 15 ఏళ్ల నుంచి యూట్యూబ్ ద్వారా దేశానికి, ప్రపంచానికి కనెక్ట్ అయ్యానని చెప్పుకొచ్చారు. తన యూట్యూబ్ ఛానల్ లో కూడా బాగానే వీడియోలు ఉన్నాయని, తనకు కూడా మంచి నెంబర్ లోనే సబ్‌స్రైబర్లు ఉన్నారని మోడీ ఈ సందర్భంగా వెల్లడించారు. సమాచార సృష్టికర్తలు చాలా మంది ప్రజలలో స్ఫూర్తి నింపుతున్నారని ఈ విషయాన్ని తాను గమనించానని మోడీ తెలిపారు.
Also Read: Gold Price Today: పసిడి ప్రియులకు శుభవార్త..భారీగా తగ్గిన బంగారం ధర.. ఎంతంటే?
క్రియేటర్లందరు కలిసి ఇంక బలమైన, శక్తివంతమైన కంటెన్ట్ ను తయారు చేయాలని మోడీ ఈ సందర్భంగా కోరారు. తన యూట్యూబ్ ద్వారా అనేక విషయాలపై మాట్లాడటం తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని మోడీ పేర్కొ్న్నారు. పరీక్షల సమయంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న ఒత్తిడి, ఉత్పాదకతపెంపు, మేనేజ్‌మెంట్ వంటి వాటి గురించి యూట్యూబ్ ద్వారా విద్యార్థులతో మాట్లాడడం తనకు చాలా సంతృప్తిని ఇస్తుందని ప్రధాని తెలిపారు. ఇక ఈ సందర్భంగా కొన్ని విషయాల గుర్తించి మాట్లాడాలనుకుంటున్న అని తెలిపిన మోడీ. ‘స్వచ్ఛ భారత్’, ‘లోకల్ ఫర్ ఓకల్’ వంటి వాటిపైనా మాట్లాడారు .
గత తొమ్మిదేళ్లుగా స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతుందని ఆయన వివరించారు. ఇక మోడీ ఈ సందర్భంగా స్వదేశీ వస్తువులను కొనేలా ప్రతి ఒక్కరిని ప్రోత్సహించాలని యూట్యూబర్లను కోరారు. వారికి భావోద్వేగ పూరిత విజ్ఞప్తి చేయాలని యూట్యూబర్లకు సూచించారు. దేశ శ్రామికులు, కళాకారుల చేతుల్లో తయారైన మన వస్తువుల్ని కొనాలని ఆయన కోరారు. ప్రస్తుతం ప్రధాని మోడీ ఛానల్ కు 1.79 కోట్ల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. ఐదు నిమిషాలు యూట్యూబ్ కార్యక్రమంలో మాట్లాడిన ప్రధాని తన ప్రసంగాన్ని ముగించే ముందు తన చానల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోవాలని కోరారు. పక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేసి తన ఛానల్ ను సబ్‌స్క్రైబ్ చేసుకోవాలని ఆయన కోరారు. ఒక సాధారణ యూట్యూబర్ లా మోడీ అలా కోరడం ప్రజలను ఆశ్చర్యానికి గురిచేసింది.