Site icon NTV Telugu

Nara Lokesh: టీటీడీ గోశాలలో గోవుల మరణాల ప్రచారంపై మంత్రి నారా లోకేష్ రియాక్షన్..

Nara Lokesh

Nara Lokesh

గోవుల మరణాలపై జరుగుతున్న ప్రచారాన్ని మంత్రి నారా లోకేష్ ఖండించారు. “టీటీడీ గోశాలలో గోవుల మరణాలంటూ దుష్ప్రచారం చేస్తున్నారు. దురుద్దేశపూరిత ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా, వాస్తవాలను టీటీడీ స్పష్టం చేసింది. తప్పుదోవ పట్టించేందుకు, రెచ్చగొట్టేందుకు వైసీపీ పురిగొల్పుతున్న తప్పుడు కథనాలను భక్తులు నమ్మొద్దు. రాజకీయ లబ్ధికోసం పవిత్ర సంస్థలపై అసత్యాలను ప్రచారం చేయడం సిగ్గుచేటు.” అని నారా లోకేష్ స్పష్టం చేశారు.

READ MORE: Allahabad HC: మరో వివాదంలో అలహాబాద్ హైకోర్టు.. “అత్యాచార” తీర్పుపై సర్వత్రా విమర్శలు

ఇదిలా ఉండగా.. ఇదే అంశంపై టీటీడీ కూడా స్పందించింది. తిరుమల తిరుపతి దేవస్థానం గోశాలలో ఇటీవల గోవులు మృతి చెందాయంటూ కొంతమంది సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారం వాస్తవం కాదని టీటీడీ స్పష్టం చేసింది. మృతి చెందిన గోవుల ఫొటోలు టీటీడీ గోశాలకు సంబంధించినవి కావని తెలిపింది. కొంతమంది దురుద్దేశంతో ఆ ఫొటోల్లో ఉన్నవి టీటీడీ గోవులుగా చూపిస్తూ భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని వెల్లడించింది. ఇలాంటి అవాస్తవ ప్రచారాన్ని ప్రజలు నమ్మొద్దని ఈ ప్రచారాన్ని ఖండిస్తున్నామని టీటీడీ తెలిపింది.

READ MORE: CM Revanth Reddy : సీఎం రేవంత్‌ రెడ్డి సంచలన నిర్ణయం.. ఫ్యూచర్‌ సిటీ వరకు మెట్రో

సోషల్‌ మీడియా వేదికగా తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి అసత్యాలు ప్రచారం చేస్తున్నారని బీజేపీ నేత, టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్‌ రెడ్డి ఆరోపించారు. ప్రజల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఎస్వీ గోశాలపై దుష్ప్రచారం చేయడం దారుణమన్నారు. ఈ మేరకు తిరుపతిలోని ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో భానుప్రకాష్‌రెడ్డి మాట్లాడారు.

Exit mobile version