గోవుల మరణాలపై జరుగుతున్న ప్రచారాన్ని మంత్రి నారా లోకేష్ ఖండించారు. "టీటీడీ గోశాలలో గోవుల మరణాలంటూ దుష్ప్రచారం చేస్తున్నారు. దురుద్దేశపూరిత ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా, వాస్తవాలను టీటీడీ స్పష్టం చేసింది. తప్పుదోవ పట్టించేందుకు, రెచ్చగొట్టేందుకు వైసీపీ పురిగొల్పుతున్న తప్పుడు కథనాలను భక్తులు నమ్మొద్దు. రాజకీయ లబ్ధికోసం పవిత్ర సంస్థలపై అసత్యాలను ప్రచారం చేయడం సిగ్గుచేటు." అని నారా లోకేష్ స్పష్టం చేశారు.
MLA Sticker : తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చొప్పదండి ఎమ్మెల్యే గా మేడిపల్లి సత్యం, గెలిచి నేటితో సంవత్సరం గడుస్తున్నా.. ఆ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ కారుకు ఎమ్మెల్యే స్టిక్కర్ మాత్రం తీయకపోవడం చర్చనీయాంశంగా మారింది. మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ గురుకుల బాట కార్యక్రమంలో, ఎమ్మెల్యే స్టిక్కర్ కెమెరాకు చిక్కింది.. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వ పాలన పోయి ఏడాది గడిచింది.. రాష్ట్ర వ్యాప్తంగా పలువురు బీఆర్ఎస్…