Nandamuri Balakrishna: సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ.. మరోసారి ఆ నియోజకవర్గం నుంచే బరిలోకి దిగుతున్నారు.. వరుసగా రెండుసార్లు విజయం సాధించిన ఆయన.. ఈ సారి కూడా గెలిచి హ్యాట్రిక్‌విక్టరీ కొట్టేందుకు ఉవ్విళ్లూరుతున్నారు.. తన నియోజకవర్గంతో పాటు రాయలసీమ జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ.. పార్టీ శ్రేణుల్లో జోష్ నింపుతున్నారు.. అయితే, ఈ రోజు హిందూపురం నియోజకర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు నందమూరి బాలకృష్ణ.. తన భార్య వసుంధరతో కలిసి హిందూపురం ఆర్‌వో కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందజేశారు.
Read Also: Rajnath Singh: బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ అవినీతి ప్రభుత్వాలే.. ఖమ్మంలో రాజ్‌నాథ్ సింగ్ ప్రచారం
ఇక, నామినేషన్ పత్రాల్లో నందమూరి బాలకృష్ణ పేర్కొన్నప్రకారం ఆయనకు రూ.9 కోట్లకు పైగా అప్పులు ఉన్నాయి.. ఎన్నికల అఫిడవిట్‌లో బాలయ్య చూపిన ఆస్తుల వివరాల విషయానికి వస్తే.. బాలకృష్ణ ఆస్తుల విలువ రూ.81 కోట్ల 63 లక్షలు… ఆయన భార్య వసుంధర ఆస్తుల విలువ రూ.140 కోట్ల 38 లక్షల 83 వేలు.. ఇక, ఆయన కుమారుడు మోక్షజ్ఞ ఆస్తుల విలువ రూ.58 కోట్ల 63 లక్షల 66 వేలుగా ఉంది.. మరోవైపు అప్పులు విషయానికి వస్తే.. బాలయ్యపై రూ.9 కోట్ల 9 లక్షల 22 వేల అప్పు ఉండగా.. ఆయన భార్య వసుంధర అప్పులు రూ.3 కోట్ల 83 లక్షల 98 వేలుగా ఉన్నాయని ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నారు నందమూరి బాలకృష్ణ..
Read Also: Gehana Vasisth: అలాంటి సినిమాలు చెయ్యట్లే, పిలవకండి.. పోర్న్ రాకెట్ నటి సంచలనం!
మరోవైపు నామినేషన్ దాఖలు చేసిన అనంతరం నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ.. హిందూపురం నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశామని తెలిపారు. పట్టణంలో తాగునీటి సమస్యను తీర్చడంతో పాటు గ్రామాల్లో సీసీ రోడ్లు, కల్వర్టులను నిర్మించినట్లు వెల్లడించారు.. అన్న క్యాంటీన్లను వైసీపీ ప్రభుత్వం తొలగించినా.. హిందూపురంలో రోజుకి 400 మందికి భోజనాలు ఏర్పాటు చేసినట్టు ఈ సందర్భంగా గుర్తుచేశారు బాలయ్య.. తనను రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించారు.. ఈసారి కూడా భారీ మెజార్టీతో తనను గెలిపించాలని హిందూపురం ఓటర్లకు విజ్ఞప్తి చేశారు నందమూరి బాలకృష్ణ..