ఇటీవల మంత్రి కొండా సురేఖ నాగార్జున కుటుంబంపై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై సినీ హీరో నాగార్జున కోర్టును ఆశ్రయించారు. నాంపల్లి కోర్టులో క్రిమినల్ డిఫమేషన్ పిటిషన్ దాఖలు చేశారు నాగార్జున తరపు న్యాయవాది. మంత్రి కొండా సురేఖ తన కుటుంబ పరువుకు నష్టం కలిగించారు అని నాగార్జున పిటిషన్ లో పేర్కొన్నారు. కుటుంబాన్ని, వ్యక్తిగత విషయాలను ప్రస్తావిస్తూ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు అంతటా వైరల్‌గా మారాయి. ఈ రోజు ఈ పరువు నష్టం దావాపై విచారణ జరగాల్సి ఉండగా.. న్యాయమూర్తి సెలవులో ఉండటంతో వాయిదా పడింది. సోమవారం దీనిపై విచారణ జరగనుంది.
READ MORE: AP Crime: ఆన్‌లైన్ బెట్టింగ్‌లో లక్షలు పోయాయి.. ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్యాయత్నం
ఓ మీడియా సంస్థతో ఎక్స్‌క్లూజివ్‌గా మాట్లాడిన నాగార్జున.. కొండా సురేఖ తన కుటుంబానికి క్షమాపణ చెప్పినా ఆమెపై వేసిన దావాను ఉపసంహరించుకోనని స్పష్టం చేశారు. రూ. 100 కోట్లకు పరువు నష్టం దావా వేసే ప్రక్రియలో ఉన్నామని తెలిపారు. ఈ ఏడాది పలు ఘటనలు నాగార్జున కుటుంబాన్ని కలచివేశాయి. వీటిపై నాగార్జున స్పందిస్తూ.. సమస్యలు ఒకదాని తర్వాత ఒకటి పేరుకుపోతున్నాయని.. తాను ఇదే చివరిది అనున్నప్పటికీ మరొకటి వస్తుందన్నారు. దైవానికి వేరే ఏవో ప్రణాళికలు ఉన్నాయనిపిస్తోందన్నారు. సమస్య ఏం లేదని.. నేను ఎల్లప్పుడూ బలమైన వ్యక్తినని భావించారు. “నా కుటుంబాన్ని కాపాడుకునే విషయంలో నేను సింహాన్ని. అదృష్టవశాత్తూ తెలుగు పరిశ్రమ మొత్తం మాకు అండగా నిలబడేందుకు ముందుకు వచ్చింది. ఇది మా నాన్నగారి ఆశీర్వాదం” అని నాగార్జున వ్యాఖ్యానించారు.
READ MORE:ICC Women’s T20 World Cup: భారీ స్కోరు చేసిన న్యూజిలాండ్.. భారత్ టార్గెట్ ఎంతంటే..?
“నేను ఎల్లప్పుడూ బలమైన వ్యక్తిని అని అనుకుంటున్నాను. నా కుటుంబాన్ని కాపాడుకునే విషయంలో నేనే సింహం. అదృష్టవశాత్తూ మొత్తం తెలుగు పరిశ్రమ మాకు అండగా నిలబడేందుకు ముందుకు వచ్చింది. ఇది మా నాన్నగారి ఆదరాభిమానాలు, ఆశీర్వాదం అని నేను భావిస్తున్నాను.” అని రాసి ఉన్న ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.