లంచాలు తీసుకునే అధికారులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని ఏసీబీ అధికారులు చర్యలు తీసుకుంటున్నప్పటికీ అడ్డుకట్టపడడం లేదు. తాజాగా వరంగల్ జిల్లాలో ఓ అధికారిణి రూ. 70 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికిపోయింది. వరంగల్ జిల్లా మత్స్యశాఖ అధికారి కార్యాలయంలో ఓ వ్యక్తి నుంచి రూ. 70 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా జిల్లా అధికారి నాగమణి, ఫీల్డ్ ఆఫీసర్ హరీష్ పట్టుబడ్డారు. తమకు అందిన సమాచారం మేరకు ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. మత్స్య పారిశ్రామిక సహకార సంఘం లోకి 84 మంది నూతన సభ్యులను చేర్చుకోవడానికి సంబంధించిన దస్తవేజును ప్రాసెస్ చేయడానికి ఫిర్యాదుధారుని నుండి రూ.70 వేలు లంచం తీసుకుంటూ తెలంగాణ అనిశా అధికారులకు పట్టుబడ్డారని అధికారులు తెలిపారు.