Nagababu: వారాహి యాత్రకు ముందు పవన్‌పై నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు.. ప్రజల ఆకాంక్ష అదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nagababu: వారాహి యాత్రకు ముందు జనసేన ప్రధాన కార్యదర్యి నాగబాబు ఆసక్తికర కామెంట్లు చేశారు.. పవన్ సీఎం కావాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారని నాగబాబు తాను విడుదల చేసిన ప్రెస్‌నోట్‌లో పేర్కొన్నారు.. సంఖ్యా బలాన్ని బట్టే సీఎం పదవి అంటూ ఇటీవలే పవన్ కల్యాణ్ స్పష్టం చేయగా.. నాగబాబు సీఎం పదవి ప్రస్తావనపై ఆసక్తికర చర్చ సాగుతోంది.. రాజకీయ విప్లవ శంఖారావం వారాహిగా అభివర్ణించిన ఆయన.. జనసేన జెండా పట్టి వారాహి వెంట నడుద్దాం.. చారిత్రాత్మక ఘట్టంలో భాగస్వాములవుదాం అని పిలుపునిచ్చారు.. ఏపీలో ప్రస్తుత అనిశ్చిత పరిస్థితుల నుంచి గట్టెక్కాలంటే జనసేన పాలన రావాల్సిందే అన్నారు.. పవన్ కళ్యాణ్ ఒక వ్యక్తిగానే వేలాది మందికి ఆపన్న హస్తం అందిస్తున్నారు. పవన్‌కు ఏపీ సీఎం అనే శక్తిని అందిస్తే ఇంకెంతో ఉపయోగకరమైన సేవలు అందిస్తారనే భావన ప్రజల్లో బలంగా నాటుకుందని పేర్కొన్నారు.
Read Also: Viral News: రోడ్డును ఎత్తేస్తున్న గ్రామస్తులు.. ఇదేం విడ్డూరం కాంట్రాక్టరు!
Also Read
- Saudi-India: ‘అప్రమత్తంగా ఉండండి.. ఇంట్లోనే ఉండండి’.. సౌదీలోని భారతీయులకు కేంద్రం సూచన
- Elon Musk: ‘‘భారతదేశానికి అసలైన బాస్ అంబానీనా?’’.. స్టార్‌లింక్‌పై మస్క్ సంచలన ప్రశ్న!
- Saudi Arabia: సౌదీ రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి.. భారత్ నుంచి విమాన సర్వీసులు నిలిపివేత
- Mecca Defence Pact: మక్కా ఒప్పందానికి బీటలు! సౌదీకి తేల్చి చెప్పిన టర్కీ!
ప్రజాధనం ఒక్క రూపాయి కూడా వృధా కాకుండా, అప్పులను అదుపు చేసి, అభివృద్ధి బాటలు వేయగల సమర్థత గల నాయకుడు పవన్ అన్నారు నాగబాబు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో విప్లవాత్మకమైన మార్పు కోసం శంఖారావం మోగించడానికి బయలు దేరుతోంది వారాహి అన్నారు.. వారాహి యాత్ర రాష్ట్ర రాజకీయాల్లో చరిత్ర సృష్టించబోతోంది. జన సైనికులు, వీర మహిళలు, నాయకులు, జనసేన శ్రేణులు సమిష్టిగా, సమాలోచనలతో వారాహి యాత్రను విజయవంతం చేయాలన్నారు. రాష్ట్రంలో నెలకొన్న దుర్భరమైన పరిస్థితులకు సంబంధించి ప్రజల్లో ఆలోచనాత్మకమైన చైతన్యం పెరుగుతోంది. ప్రజలంతా కలిసి మెలిసి జీవించే వాతావరణాన్ని సృష్టించడమే వారాహి యాత్ర ప్రధాన ధ్యేయం అన్నారు.. పవన్ కల్యాణ్‌కు మద్దతుగా జనసేన జెండా పట్టి వారాహి వెంట అడుగులు వేద్దాం. చారిత్రాత్మక ఘట్టంలో భాగస్వాములవుదాం అంటూ పిలుపునిచ్చారు జనసేన ప్రధాన కార్యదర్యి నాగబాబు.
రాజకీయ విప్లవ శంఖారావం వారాహి
* జనసేన జెండా పట్టి వారాహి వెంట నడుద్దాం
* చారిత్రాత్మక ఘట్టంలో భాగస్వాములవుదాం – జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ @NagaBabuOffl గారు#VarahiYatra#JanaSenaVarahi pic.twitter.com/KgBmQ5DDjw
— JanaSena Party (@JanaSenaParty) June 8, 2023
తాజావార్తలు
-
Saudi-India: ‘అప్రమత్తంగా ఉండండి.. ఇంట్లోనే ఉండండి’.. సౌదీలోని భారతీయులకు కేంద్రం సూచన
-
Elon Musk: ‘‘భారతదేశానికి అసలైన బాస్ అంబానీనా?’’.. స్టార్‌లింక్‌పై మస్క్ సంచలన ప్రశ్న!
-
Telangana SIR : తెలంగాణ ఓటర్ల జాబితాలో భారీ మార్పులు.. 12,204 ఓట్లు డిలీట్
-
Rahul Sankrityan: ఆ ఆవేశం నుంచే ‘రణబాలి’ పుట్టింది: రాహుల్ సాంకృత్యన్
-
Nadendla Manohar : నాదెండ్ల మనోహర్ ఫైర్.. వైసీపీకి 11 సీట్లు కూడా రావంటూ వార్నింగ్.!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!