Rahul Sankrityan: ఆ ఆవేశం నుంచే ‘రణబాలి’ పుట్టింది: రాహుల్ సాంకృత్యన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Sankrityan: “కేవలం రెండేళ్ల వ్యవధిలో అన్నం దొరక్క కోటి మంది ప్రజలు అన్యాయంగా చనిపోయారు. ఇంతటి ఘోర కలియుగ విలయం జరిగితే మన పాఠ్యపుస్తకాల్లో ఎందుకు రాయలేదు? ఈ చేదు నిజాన్ని ఎందుకు దాచిపెట్టారు? ఆ చరిత్ర తెలుసుకున్నప్పుడు నాకు తీవ్ర ఆగ్రహం, ఆవేశం వచ్చాయి.. ఆ ఆవేశంలోంచి పుట్టిన కన్నెర్రే ఈ ‘రణబాలి’” అంటూ దర్శకుడు రాహుల్ సాంకృత్యన్ ఈ సినిమా తీయడానికి కారణాలను బయటపెట్టారు. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా, రష్మిక మందన్న హీరోయిన్గా మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న పీరియాడిక్ చిత్రం ‘రణబాలి’. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో డైరెక్టర్ పంచుకున్న రీసెర్చ్ వివరాలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘శ్యామ్ సింగరాయ్’ సక్సెస్ తర్వాత తన నెక్స్ట్ సినిమా కోసం ఆలోచిస్తున్న టైంలో రాయలసీమకు చెందిన ఒక ప్రాచీన బుర్రకథ తన దృష్టికి వచ్చిందని చెప్పారు. కథలు ఒక తరం నుంచి మరో తరానికి ట్రావెల్ అయ్యే క్రమంలో దేవుళ్లతో మాట్లాడే, రాక్షసులను చీల్చి చెండాడే ఒక సీమ యోధుడి గాథ తనను కదిలించిందన్నారు. ఆ నేల చరిత్రను లోతుగా అధ్యయనం చేస్తున్నప్పుడు దాదాపు 150 ఏళ్ల క్రితం నాటి ‘ది గ్రేట్ సౌత్ ఇండియన్ మద్రాస్ ఫ్యామిన్’ (మహా కరువు) గురించిన చేదు నిజాలు బయటపడ్డాయి. పరాయి పాలకుల స్వార్థానికి కేవలం రాయలసీమ మాత్రమే కాదు.. కోస్తాంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల్లోని కోటి మంది అమాయకులు ఆకలికి బలయ్యారని చరిత్రకారులు, ప్రాచీన గ్రంథాల ద్వారా రూఢీ చేసుకున్నట్లు చెప్పారు. ఇంతటి తీవ్రమైన చారిత్రక కథకు ప్రాణం పోయాలంటే సాధారణ నటుడు సరిపోడని రాహుల్ స్పష్టం చేశారు. “చిన్నప్పుడు చందమామ కథల పుస్తకం కవర్‌పేజీపై కనిపించే యోధుడిలా.. చేతిలో కత్తి, గుర్రపు స్వారీ, కళ్లల్లో రౌద్రం ఉండే భారీ కటౌట్ కావాలి. ఈ పాత్ర కోసం శరీరాన్ని హూనం చేసుకునేంత కష్టపడే సత్తా విజయ్ దేవరకొండకు మాత్రమే ఉంది. నా ఆలోచనను చెప్పగానే చరిత్రపై అమితాసక్తి ఉన్న విజయ్ వెంటనే ఓకే చెప్పారు” అని తెలిపారు. ఈ సినిమా కోసం రెండేళ్లు రీసెర్చ్, మరో రెండేళ్లు షూటింగ్.. కలిసి నాలుగు సంవత్సరాల పాటు ప్రాణం పెట్టి పనిచేశామని వివరించారు.
Also Read
- Vijay Deverakonda: 'ఏం పనిరా మీ తెల్లొళ్లకి ఈడ'.. బ్రిటీషర్లపై సీమ యాసలో రౌడీ విశ్వరూపం!
- Ranabali Trailer: తెల్లదొరల గుండెల్లో సింగనమల బొబ్బిలి నిప్పులు.. గూస్బంప్స్ తెప్పిస్తున్న 'రణబాలి' ట్రైలర్!
- Mythri Ravi: మా విజయ్ అలాంటివాడు కాదు.. ఆ నెగెటివిటీ పక్కనపెట్టి చూడండి: మైత్రీ రవి
- Prabhas’ Fauzi: నెల రోజుల పాటు ప్రభాస్ ‘ఫౌజీ’ క్లైమాక్స్ వార్.. ఇక మిగిలింది రెండే ఫైట్లు!
సినిమా టైటిల్ గురించి వివరిస్తూ.. తారకాసురుడిని సంహరించడానికి దేవసేనాని కుమారస్వామి (మురుగన్) యుద్ధ రంగానికి వెళ్లే ముందు ఎత్తిన ఉగ్ర అవతారమే ‘రణబాలి’ అని రాహుల్ చెప్పారు. పరాయి పిశాచుల దయ్యం వదిలించడానికి కసాపురం ఆంజనేయ స్వామి స్వయంగా ఎదురొస్తే ఎలా ఉంటుందో.. ఈ సినిమాలో హీరో పాత్ర కూడా తెల్లదొరలపై అలానే విరుచుకుపడుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ తరానికి స్విగ్గీలో 5 నిమిషాల్లో ఫుడ్ అందుతుండవచ్చని, కానీ తిండి గింజలు లేక తమ పూర్వీకులు ఎలా మరణించారో, ఆ అకృత్యాలకు ఎలా ఎదురొడ్డారో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని కోరారు. మైత్రీ మూవీ మేకర్స్ ఎక్కడా రాజీపడకుండా నిర్మించిన ఈ అద్భుత దృశ్యకావ్యం దసరా కానుకగా అక్టోబర్ 16న థియేటర్లలోకి వస్తోంది. ఈ సినిమా వెండితెరపై ఒక మహా యుద్ధంలా ప్రేక్షకులను మెస్మరైజ్ చేయడం ఖాయమని చిత్ర బృందం నమ్ముతోంది.
తాజావార్తలు
-
Rahul Sankrityan: ఆ ఆవేశం నుంచే ‘రణబాలి’ పుట్టింది: రాహుల్ సాంకృత్యన్
-
Nadendla Manohar : నాదెండ్ల మనోహర్ ఫైర్.. వైసీపీకి 11 సీట్లు కూడా రావంటూ వార్నింగ్.!
-
Vijay Deverakonda: ‘ఏం పనిరా మీ తెల్లొళ్లకి ఈడ’.. బ్రిటీషర్లపై సీమ యాసలో రౌడీ విశ్వరూపం!
-
Ranabali Trailer: తెల్లదొరల గుండెల్లో సింగనమల బొబ్బిలి నిప్పులు.. గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘రణబాలి’ ట్రైలర్!
-
Saudi Arabia: సౌదీ రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి.. భారత్ నుంచి విమాన సర్వీసులు నిలిపివేత
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!