టాలీవుడ్ యంగ్ హీరో నాగ శౌర్య ప్రతి సినిమా కు తన టాలెంట్ నిరూపించుకుంటూ మినిమమ్ గ్యారెంటీ హీరోగా పేరును సంపాదించుకున్నాడు.నాగ శౌర్య కు ‘ఛలో’ సినిమా తర్వాత యూత్ లో మంచి ఫాలోయింగ్ కూడా పెరిగింది. ఈయన కెరీర్ లోనే బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ సినిమా తర్వాత ఆ స్థాయి హిట్ అయితే అందుకోలేక పోయాడు. ఇక ఇప్పుడు మరో సినిమాను చేస్తున్నాడు. కొత్త డైరెక్టర్ పవన్ బాసంశెట్టి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా లో యుక్తి తరేజా హీరోయిన్ గా ఫిక్స్ అవ్వగా ”రంగబలి”అనే టైటిల్ ను ఫిక్స్ చేసారు. ఈ సినిమా ను శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి వారు నిర్మిస్తున్నారని తెలుస్తుంది. ఈ సినిమాకు పవన్ సిహెచ్ సంగీతం అందిస్తుండగా.. దివాకర్ మణి కెమెరా మ్యాన్ గా పని చేస్తున్నట్లు సమాచారం.
ఈ సినిమా యొక్క ఫస్ట్ లుక్ టీజర్ ను కూడా తాజాగా మేకర్స్ విడుదల చేయగా ఈ సినిమా లో నాగ శౌర్య హ్యాపీ గా లైఫ్ లీడ్ చేసే పాత్రలో నటిస్తున్నాడు.ఈయన లుక్, యాక్షన్ అలాగే ఎంటర్టైన్మెంట్ అందరిని ఆకట్టుకోవడం తో రంగబలి సినిమాపై మంచి ఇంప్రెషన్ అయితే వచ్చింది. ఈ టీజర్ లాంచ్ సందర్భం గా నాగ సౌర్య మీడియా తో కూడా మాట్లాడారు.. ఈ సందర్భంగా ఈయన చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.. ప్రభాస్ కు బుజ్జిగాడు సినిమా ఎంత ప్రత్యేకమో అందరికి కూడా తెలుసు. ఈ సినిమాలో ఈయన సహజమైన బాడీ లాంగ్వేజ్ అలాగే ప్రత్యేకమైన స్టైల్ అందరిని బాగా ఆకట్టుకుంది. అదే విధంగా రంగబలి లో నా పాత్ర కూడా అదేవిదంగా విభిన్నమైన బాడీ లాంగ్వేజ్ లో ఉంటుందని దీని కోసం టీమ్ అంతా చాలా కష్టపడ్డాం అని సినిమా విడుదల తర్వాత తప్పకుండ ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది అని చెప్పుకొచ్చాడు