టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్య, హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. కొద్దిసేపటి క్రితమే శోభిత మెడలో చై మూడుముళ్లు వేశారు. చై-శోభిత వివాహం బుధవారం రాత్రి 8.15 నిమిషాలకు జరిగింది. అన్నపూర్ణ స్టూడియోలో వీరిద్దరి పెళ్లి వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఈ పెళ్లికి ఇరు కుటుంబ సభ్యులు, బంధువులు, సినీ ప్రముఖులు, సన్నిహితులు హాజరయ్యారు. నాగచైతన్య-శోభిత పెళ్లికి మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. మహేష్ బాబు దంపతులు, రామ్ చరణ్ దంపతులతో పాటు హీరోలు…