టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య ప్రజంట్ ‘తండేల్’ బ్లాక్ బస్టర్ కావడంతో మంచి సక్సెస్ జోష్‌లో ఉన్నాడు. పెళ్లయిన తర్వాత శోభిత వచ్చిన వేళ విశేషమని అక్కినేని అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. నాగార్జున కూడా కొడుకు సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ఇదే జోష్‌లో చై.. ‘విరూపాక్ష’ ఫేమ్ కార్తీక్ దండు దర్శకత్వంలో ఓ సినిమాలో నటించనున్నారు. మిస్టరీ హార్రర్ థ్రిల్లర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాను బీవీఎస్ఎన్ ప్రసాద్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా తెరకెక్కించనున్నాయి. మూవీస్ విషయం పక్కన పెడితే ఈ మధ్యకాలంలో చాలా మంది సినీ తారలు, సినిమాలతో పాటు వ్యాపారాలలోనూ సక్సెస్ అవుతూ, రెండు చేతులా సంపాదిస్తున్నారు. అలా టాలీవుడ్‌తో పాటు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రిలో మోస్ట్ సక్సెస్‌ఫుల్ బిజినెస్‌మెన్‌లలో ఒకరు అనిపించుకున్నారు నాగార్జున. అన్నపూర్ణ స్టూడియోస్, ఎన్ కన్వెన్షన్‌తో పాటు నాగార్జునకు ఎన్నో వ్యాపారాలు ఉన్నాయి. అలాగే మరిన్ని సంస్థలలోనూ ఆయన పెట్టుబడులు పెట్టాడు. ఇక తండ్రి బాటలోనే కొడుకు చైతన్య కూడా నడుస్తుతున్నాడు.
Also Tead: Vijay Varma : ఒక బంధాన్ని ఐస్‌క్రీంలా ఆస్వాదించాలి..
ఇదివరకే చైతన్య పలు వ్యాపారాలు చేస్తున్నప్పటికి రీసెంట్‌గా తన భార్య శోభితతో కలిసి మరో కొత్త వ్యాపారాన్ని ప్రారంభించారు. ‘షుజి’ పేరుతో తమ నూతన ఫుడ్ బిజినెస్ మొదలు పెట్టినట్లు నాగ చైతన్య, శోభిత సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న రుచులన్నింటినీ ఒకేచోట అందించే లక్ష్యంతో ఈ ‘షోయు’ ని పరిచయం చేస్తున్నట్లు చైతన్య కూడా తెలిపారు. తమ ప్రయత్నానికి అభిమానుల ఆదరణ, ప్రోత్సాహం ఎల్లప్పుడూ ఉండాలని కోరాడు. అలాగే కిచెన్, అక్కడ తయారవుతున్న వివిధ రకాల వంటకాల ఫోటోలను సోషలక్ మీడియాలో పంచుకున్నాడు.