Karnataka Man Prashant Hulekal Puja to Real Cobra On Nagula Panchami: సాధారణంగా ‘నాగుల పంచమి’ నాడు భక్తులు ఆలయాలకు వెళుతుంటారు. ఉదయాన్నే శివాలయాలకు చేరుకుని ముక్కంటిని దర్శించుకుంటారు. ఆపై పుట్ట దగ్గర పాలు పోసి పూజలు చేస్తారు. ఒకవేళ పుట్ట వద్ద పాము ప్రత్యక్షం అయితే.. దానికి దగ్గర పాలు పెట్టి పూజిస్తారు. అయితే ఓ వ్యక్తి ఏకంగా నిజమైన నాగుపామునే ఇంటికి తీసుకొచ్చి పూజలు చేశాడు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకుంది.
ఉత్తర కన్నడ జిల్లా శిరసికి చెందిన ప్రశాంత్ హులేకల్ అనే వ్యక్తికి పాములు అంటే చాలా ఇష్టం. ప్రతి సంవత్సరం నాగుల పంచమిని తన కుటుంబ సభ్యులతో కలిసి ఘనంగా జరుపుకుంటాడు. నిజమైన పాముని ఇంటికి తీసుకొచ్చి పూజిస్తాడు. ప్రశాంత్ కుటుంబసభ్యులు ఈసారి పాము పిల్లకు ప్రత్యేక పూజలు చేశారు. సోమవారం నాడు పూజ గదికి చిన్న పాము పిల్లను తీసుకు వచ్చి.. దానికి దండ వేసి అలంకరించారు. ఆ పాము పిల్లకి పాలు పట్టించి.. పూజలు చేశారు. పూజల అనంతరం దాన్ని అడవిలోకి విడిచి పెట్టారు. ఇందుకు సంబందించిన న్యూస్, ఫొటోస్ వైరల్ అయ్యాయి.
Also Read: Shravana Masam 2023: శ్రావణ మాసం చివరి సోమవారం ఈ 3 చర్యలు చేస్తే.. మీ కోరికలు ఫలిస్తాయి!
ప్రశాంత్ హులేకల్ పాములను పడుతుంటాడు. గత 35 సంవత్సరాలుగా పాములను అతడు రక్షిస్తున్నాడు. ఇళ్లలోకి వచ్చే పాములను పట్టుకుని అడవిలో విడిచి పెడుతుంటాడు. అంతేకాదు పాములకు సంబంధించిన సమాచారాన్ని విద్యార్థులకు వివరిస్తూ ఉంటాడు. పాములపై వాటిపై ప్రేమ, పాములను రక్షించండి అంటూ సమాజానికి సందేశం ఇచ్చేందుకే ఈ తరహాలో నాగ పంచమిని జరుపుకున్నట్లు ప్రశాంత్ తెలిపాడు.