Shravana Masam 2023 Last Monday Remedies: సంవత్సరంలోని 12 నెలలలో అత్యంత పవిత్రమైనదిగా ‘శ్రావణ మాసం’ పరిగణించబడుతుంది. ఈ మాసంలో పరమశివుడు తన కుటుంబంతో కలిసి భూలోకంలో తిరుగుతాడని వేదశాస్త్రంలో చెప్పబడింది. శ్రావణ మాసంలో పరమశివుని భక్తికి విశేష మహిమ ఉంది. ముఖ్యంగా శ్రావణ సోమవారాల్లో శివుడిని ఆరాధించడం వల్ల.. అతని ఆశీస్సులు మీ కుటుంబంపై ఉంటాయి. ఈసారి శ్రావణ మాసం 59 రోజులు ఉంది. జూలై 3న ప్రారంభమైన ఈ మాసం ఆగస్టు 31న ముగుస్తుంది. ఈసారి శ్రావణ సోమవారాలు 7 వచ్చాయి. ఆగస్టు 28న చివరి సోమవారం వస్తుంది.
ధ్యానం:
మత పండితుల ప్రకారం ఈసారి సోమ ప్రదోష వ్రతాన్ని శ్రావణ మాసం చివరి సోమవారం (28 ఆగస్టు 2023) నాడు కూడా ఆచరిస్తారు. ఈ రోజున కొన్ని ప్రత్యేక చర్యలు చేయడం వల్ల పరమశివుడు సంతోషిస్తాడు. చివరి సోమవారం నాడు తెల్లవారుజామున నిద్రలేచి.. స్నానం అనంతరం మహాదేవుని ధ్యానించాలి.
Also Read: Tuesday Remedies: మంగళవారం నాడు ఈ మూడు చర్యలు చేస్తే.. మీ ఇంట్లో డబ్బే డబ్బు!
ఉపవాసం:
ఆగస్టు 28 వచ్చే చివరి సోమవారం నియమ నిబంధనలతో ఉపవాసం చేయండి. ఉదయాన్నే దగ్గరలోని ఆలయానికి వెళ్లి.. జలాభిషేకం చేయండి. శివ లింగానికి పాలు, గంధం మరియు పెరుగుతో అభిషేకం చేయండి. తర్వాత ఆలయంలో కూర్చుని భక్తితో శివ చాలీసా పఠించండి.
శివుని మంత్రాలు:
సాయంత్రం ప్రదోష కాల సమయంలో శివుడిని పూజించండి. తర్వాత అశివుని మంత్రాలను జపించండి. ఆపై గుడికి వెళ్లి శివుని పూజించండి. మీ కోరికలను నెరవేర్చమని ప్రార్థించండి. ఇలా చేస్తే అదృష్టం మీ వెంటే ఉంటుంది. ఎలాంటి సమస్యలు దరి చేరవు. ఆర్ధిక స్థితి కూడా బాగుంటుంది.
(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ntvtelugu.com దీన్ని ధృవీకరించలేదు.)