మహానటి, ప్రస్తుతం కల్కి 2898 ఏడి సినిమాల దర్శకత్వం వహిస్తున్న నాగ అశ్విన్ తాజాగా తన పుట్టినరోజు వేడుకలను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. హాలీవుడ్ స్టైల్ కలిగిన సినిమాను తెరకేకిస్తూ టాలీవుడ్ ఆడియన్స్ ముందుకు ఓ అద్భుతాన్ని తీసుకురాబోతున్నాడు. ఈ సినిమా కథలో భాగంగా ఇప్పటికే ఓ స్టోరీ లైన్ చెప్పి ఆడియన్స్ లో మరింత అంచనాలను పెంచేశాడు డైరెక్టర్. ఇందుకు తగిన విధంగానే సినిమాకు సంబంధించి గ్లింప్స్ కూడా విడుదల చేసి మెప్పించాడు. ప్రస్తుతం ఈ సినిమా సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.
Also read: Akhilesh Yadav: లోక్‌సభ బరిలో ఎస్పీ చీఫ్.. కన్నౌజ్ నుంచి పోటీ..
ఇక ఈ సినిమా షూటింగ్ సెట్టింగ్స్ లో డైరెక్టర్ నాగ్ అశ్విన్ పుట్టినరోజు వేడుకలను చిత్ర యూనిట్ గ్రాండ్ గా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో భాగంగా నాగార్జున నటించిన ‘మాస్’ సినిమాలోని టైటిల్ సాంగ్ ని ప్లే చేయగా డైరెక్టర్ నాగ అశ్విన్ తో పాటు చిత్ర యూనిట్ మొత్తం కలిసి డాన్సులు చేస్తూ తెగ ఎంజాయ్ చేశారు. అయితే ఈ పార్టీలో హీరో ప్రభాస్ మాత్రం ఎక్కడ కనిపించలేదు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారంది. కాకపోతే సోషల్ మీడియా ద్వారా హీరో ప్రభాస్ నాగ్ అశ్విన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
Also read: Kakarla Suresh: ప్రచారంలో దూసుకుపోతున్న కాకర్ల.. అడుగడుగునా నీరాజనం
ఇందులో భాగంగా ‘కల్కి విషయంలో నీ విజన్ నాకు స్ఫూర్తిని ఇస్తుంది అంటూ.. అద్భుతమైన దర్శకుడు నాగ అశ్విన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు.. అంటూ తన ఇంస్టాగ్రామ్ స్టోరీ ద్వారా విషెస్ తెలిపారు. ఇక కల్కి సినిమా నుంచి తాజాగా అమితాబచ్చన్ పాత్రను పరిచయం చేసి అందరిని మెప్పించారు. అచ్చం ఇలాంటి కొన్ని క్లిప్పింగ్స్ సినిమా విడుదలకు ముందే అన్ని పాత్రలకి సంబంధించి విడదల కాబోతున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినపడుతోంది.
#Prabhas #Kalki2898AD director NagAshwin Birthday Celebrations !!💥❤️🥳🙌 pic.twitter.com/5lRzTTlFAQ
— Pradeep™ (@Pradeepreddy___) April 24, 2024