Nadendla Manohar : జనసేనకు సభ ఇచ్చారని కక్ష కడతారా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జగన్ ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలు క్షోభలో ఉంటే సైకో జగన్ పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారని మండిపడ్డారు. కావాలని సమస్య సృష్టించి రాక్షస ఆనందంతో బతికే వ్యక్తి జగన్ అని ఆయన ఆరోపించారు. ఒక ఇంట్లో అనారోగ్యంతో మహిళ బాధపడుతున్నారని, మరో చోట పెళ్లి పెట్టుకున్న ఇంటిని కూలగొట్టారన్నారు. పాత మార్కింగ్ సమయంలో స్వచ్ఛందంగా ప్రజలే ప్రహరీ పడగొట్టుకున్నారని, ఇప్పుడు కాలువలు దాటి కొత్త మార్కింగ్ పెట్టడం దుర్మార్గమన్నారు. జనసేనకు సభ ఇచ్చారని కక్ష కడతారా..? అని ఆయన మండిపడ్డారు.
Also Read : Priya Prakash Varrior: వింక్ బ్యూటీ.. బ్లాక్ అండ్ వైట్ లో కూడా ధారాళంగా చూపించేస్తోందే
Also Read
మాకు సహకరించిన ప్రజలకు మేము అండగా ఉంటామన్న ఆయన.. మరోసారి అధికారులు ఇక్కడ హడావుడి చేస్తే ఊరుకోమన్నారు. మచిలీపట్నం సభకు ఆటంకాలు కలిగించేందుకు ఇక్కడ ఇబ్బంది పెడతారా..? అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మా పార్టీకి పెరుగుతున్న ఆదరణ చూసి జగన్‌కి పిచ్చెక్కిందన్నారు. రోజు కూలి చేసుకునే వాళ్లపైనా నీ ప్రతాపమని, 151మంది ఎమ్మెల్యేలను ఇచ్చింది ఇలాంటి దాడి చేయమనా..? 175 ఎమ్మెల్యేలను మీకు ఇస్తే ప్రజలను బతకనిస్తారా..? దమ్ముంటే అంటున్నారుగా.. వైసిపి నాయకులు ఇక్కడకి రండి.. వీళ్లని చూడండి. అధికారులకు కూడా తప్పు చేస్తున్నామని అర్థం అయ్యింది. మా అధినేత బాధ్యతగా ఇక్కడకు వచ్చారు..
Also Read : Summer Tips: వేసవిలో ఇవి తీసుకుంటే సూర్యుడు ఎంత వేడిగా ఉన్నా.. మీరు చల్లగా ఉంటారు
ధ్వంసాలు, విధ్వంసాలే జగన్ పాలన. పేదల కన్నీటిని చూసేందుకు జగన్ పాలన చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ నేతృత్వంలో మా పోరాటం కొనసాగుతుంది. ఈ సైకో సీఎం వచ్చే ఎన్నికల తరువాత తప్పకుండా ఇంటికి వెళ్లడం ఖాయం.’ అంటూ ఆయన ధ్వజమెత్తారు.
తాజావార్తలు
-
OTR : నెల్లిమర్ల నగర పంచాయతీలో ఛైర్మన్ సీటు పంచాయితీ
-
Pothireddypadu : పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద భారీ ప్రమాదం.. తెగిపడిన 9వ గేటు
-
Gyanesh Kumar: ‘సర్’ ఫిర్యాదులు వచ్చే ఎన్నికల నాటికి పరిష్కరిస్తాం.. సీఈసీ కీలక వ్యాఖ్యలు
-
OTR: చిన్నారెడ్డి ఏం చేయబోతున్నాడు..?
-
Story Board : ఉద్యోగ నియామకాల్లో ఎక్కడ తేడా కొడుతోంది ? అన్ని రాష్ట్రాల్లో ఇంతేనా ?
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?