* తిరుమల: నేడు అయోధ్యకు లక్ష లడ్డూలను తరలించనున్న టీటీడీ.. రామాలయం ప్రారంభం రోజు భక్తులకు లడ్డూల పంపిణీ
* విజయవాడ: నేడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ భారీ విగ్రహం ఆవిష్కరణ.. 18 ఎకరాల్లో అంబేద్కర్ విగ్రహం, స్మృతివనం.. అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్న సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. 81 అడుగుల పీఠంపై.. 125 అడుగుల ఎత్తైన విగ్రహం ఏర్పాటు.. ముందుగా ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో సామాజిక సమతా సంకల్ప సభ పేరుతో బహిరంగ సభ.. తర్వాత స్వరాజ్ మైదానంలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ
* సంగారెడ్డి: నేటి నుంచి రెండు రోజుల పాటు ఐఐటీ హైదరాబాద్ క్యాంపస్ లో ఇన్వెంటివ్-2024 పేరుతో ఇన్నోవేషన్ ఫెయిర్.. కార్యక్రమాన్ని వర్చువల్ గా ప్రారంభించనున్న కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్.. ఫెయిర్ లో 120 ఆవిష్కరణలను ప్రదర్శించనున్న 23 IITలు, NITలు, IITలు, ఐఐసీ, 50కి పైగా సాంకేతిక విద్యాసంస్థలు.. కార్యక్రమంలో పాల్గొననున్న 2 వేల మంది పారిశ్రామిక వేత్తలు
* అయోధ్యలో ముగ్గురు ఉగ్రవాద అనుమానితుల అరెస్ట్.. అనుమానితులను ప్రశ్నిస్తున్న యూపీ యాంటా టెర్రరిస్ట్ స్క్వాడ్..
* ఢిల్లీ: రేపు సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం వర్సెస్ చంద్రబాబు కేసు విచారణ.. చంద్రబాబుకు హైకోర్ట్ స్కిల్ కేసులో ఇచ్చిన బెయిల్ ను సుప్రీం కోర్టులో సవాలు చేసిన ప్రభుత్వం
* ఏపీలో 39వ రోజు కొనసాగనున్న అంగన్వాడీ కార్యకర్తల నిరసన కార్యక్రమాలు..
* ప్రకాశం: జిల్లా వ్యాప్తంగా ఇవాళ్టి నుంచి కులగణన ప్రారంభం.. జిల్లాలోని 719 పంచాయతీల్లో కార్యక్రమాన్ని ప్రారంభించనున్న అధికారులు..
* ప్రకాశం: మార్కాపురంలో టీడీపీ నేతలతో నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి సమీక్షా సమావేశం..
* ప్రకాశం: అర్ధవీడు మండలం రంగాపురంలో టీడీపీ నేతలతో గిద్దలూరు టీడీపీ ఇంచార్జ్ మాజీ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి సమీక్షా సమావేశం..
* గుంటూరు జిల్లా: నేడు చేబ్రోలులో టీడీపీ, జనసేన పార్టీల నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశం. పాల్గొననున్న మాజీ ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్ర , జనసేన నాయకులు
* పల్నాడు జిల్లాలో నేటి నుండి ఈ నెల 23 వరకు కుల గణన కార్యక్రమం..
* నెల్లూరు జిల్లా: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి వెంకటాచలం మండలంలో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు
* నెల్లూరు: వెంకటగిరిలో టీడీపీ ఆధ్వర్యంలో రా కదలిరా బహిరంగ సభ.. పాల్గొననున్న ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు.. పార్టీ నేతలు
* నెల్లూరు రూరల్ పరిధిలోని ఆర్టీసీ కాలనీలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇంటింట ప్రచారం
* తూర్పుగోదావరి జిల్లా: నేడు రాజమండ్రిలోశ్రీ రామ విజయాత్ర.. అయోధ్య రామ మందిరం ప్రతిష్ట పురస్కరించుకుని చేపఢుతున్న శ్రీ రామ విజయాత్ర
* అనంతపురం : పెద్దవడుగూరు మండలం గోపురాజుపల్లి, మొలకతాళ్ళ, చిత్రచేడు గ్రామాలలో యువ చైతన్య బస్సు యాత్ర చేపట్టనున్న మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి.
* అనంతపురం : నేటి నుంచి ఈనెల 28 దాకా ఇంటింటా కులగణన కార్యక్రమం.
* అనంతపురం : కలెక్టరేట్ లోని రెవెన్యూ భవన్ లో ఉద్యోగుల ప్రత్యేక స్పందన కార్యక్రమం.
* తిరుమల: ఆన్‌లైన్‌లో ఏప్రిల్ నెలకు సంబంధించిన టికెట్లు విడుదల చేసిన టీటీడీ.. రేపు ఉదయం 10 గంటల వరకు లక్కి డిఫ్ విధానంలో పోందే ఆర్జిత సేవలకు నమోదు చేసుకునే అవకాశం
* చిత్తూరు: పీలేరులో మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పర్యటన …
* అనంతపురం : ఈనెల 23 న ఉరవకొండలో పర్యటించనున్న సీఎం జగన్.. వ్తెఎస్సాఆర్ ఆసరా నాల్గోవిడత నిధులు విడుదల చేయనున్న సీఎం.
* అనంతపురం : నగరంలోని ఆర్ట్స్ కళాశాల సమీపంలో యోగి వేమన కాంస్య విగ్రహం పునఃప్రతిష్ట కార్యక్రమం.