జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదరెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. రామాయణంలో శ్రీరాముడి వనవాసం, మహాభారతంలో ద్రౌపది వస్త్రాభరణం కంటే ఘోరంగా జనగామ బీఆర్ఎస్ లో అంతకు మించి రాజకీయ కుట్రలు పన్నుతున్నారని, రాముని వనవాసం, ద్రౌపది వస్త్రాభరణాన్ని చరిత్ర నుంచి తొలగించాలి. ద్రౌపదిమానాన్ని శ్రీకృష్ణుడు ఒక్కడే ఎందుకు కాపాడాలి. విధురుడు, కర్ణుడు, ద్రోణుడు ఎందుకు ముందుకు రాలేదన్నారు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి. నియోజకవర్గంలో ఎమ్మెల్యే ను కాదని మంత్రులు, ఇంకా ఎవరైనా సరే అడుగు పెట్టరాదని స్వయంగా సీఎం కేసీఆర్ చెప్పిన తర్వాత ఈ కుతంత్రాలు ఏంటని ఆయన ప్రశ్నించారు.
Also Read : Allola Indrakaran Reddy : అక్టోబర్ 4న నిర్మల్‌కు కేటీఆర్.. ఏర్పాట్లపై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సమీక్ష
గతంలో జనగామలో సమావేశం వద్దని కేటీఆర్ వెనక్కి పంపించినా, ఆయన ఆదేశాలు ధిక్కరించి నిన్నటి రోజు మీటింగ్ పెట్టుకున్నారని ఆయన మండిపడ్డారు. నా బిడ్డ వాళ్ళనే సీటు పోతుందని కొంతమంది చెప్పే ప్రయత్నం చేస్తున్నారని, కానీ తనతో పలికించే శక్తులు వేరే అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జనగామలో వర్గాలుగా పార్టీని విడగొట్టి చెల్లాచెదురు చేస్తున్న వ్యక్తులను తీవ్రంగా హెచ్చరిస్తున్నానని, కేసీఆర్ శరీరంలో ముత్తిరెడ్డి ఒకరని ఆయన అన్నారు. అలాంటి కేసీఆర్ వర్గాన్ని జనగామలో రెండు ముక్కలు చేశారని ముత్తిరెడ్డి ధ్వజమెత్తారు. ప్రజల కోసం నిర్మాణం చేసిన శాసనాలు, రాజ్యాంగానికి అడ్డుపడ్డ వ్యక్తులపై మాత్రమే ముత్తిరెడ్డి దురుసుగా వ్యవహరించాడు తప్ప ఏనాడు వ్యక్తిగతం కోసం పాకులాడలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జనగామ బీఆర్ఎస్ పార్టీలో ఇప్పటివరకు ఒక్క కేసీఆర్ వర్గం తప్ప ఏ వర్గము లేదని, అలాంటిది ముత్తిరెడ్డి వర్గం అని చెప్పేటట్లు చేశారని ముత్తిరెడ్డి వ్యాఖ్యానించారు. జనగామలో మరోసారి ఒక్క అవకాశం ఇవ్వండి ఇప్పటివరకు మిగిలిన పనులన్నీ పూర్తి చేసి జిల్లాకు ఒక ఆకృతి తీసుకువస్తా అని సీఎంను కోరడం జరిగిందని, ప్రజా సేవ చేయడమే నాకు తెలుసు వేషం భాష మార్చడం రాదని ఆయన అన్నారు.
Also Read : Swayambhu : స్వయంభు కోసం కత్తి సాము నేర్చుకుంటున్న నిఖిల్..