Swayambhu : స్వయంభు కోసం కత్తి సాము నేర్చుకుంటున్న నిఖిల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. హ్యాపీ డేస్ సినిమాతో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ సినిమా తరువాత హీరో గా వరుస సినిమాలు చేసి మంచి గుర్తింపు సాధించాడు.వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ తో దూసుకుపోతున్నాడు. ఇటీవల కార్తికేయ 2 సినిమాతో పాన్ ఇండియా స్థాయి సక్సెస్ అందుకున్న ఈ యంగ్ హీరో.. ఆ తరువాత వచ్చిన స్పై మూవీతో ఆడియన్స్‌ను కాస్త డిసప్పాయింట్ చేశాడు. డిఫరెంట్ స్క్రిప్ట్స్ తో పాటు చాలెంజింగ్ క్యారెక్టర్స్ చేయడానికి ఎంతో ఆసక్తి చూపిస్తున్న ఈ యంగ్ హీరో నుంచి వస్తోన్న..మరో క్రేజీ, పీరియాడిక్ మూవీ స్వయంభు .ఈ సినిమా ఫస్ట్‌లుక్ లో నిఖిల్ యుద్ధ వీరుడిగా కనిపించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు.తాజాగా ఈ మూవీ నుంచి కత్తి సాము ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను మేకర్స్ షేర్ చేశారు. వియాత్నంలోని సముద్ర తీరంలో ప్రాక్టీస్ చేస్తున్న ఈ వీడియోకు..ప్రకృతి మాత ఆశీర్వాదానికి చిహ్నం అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చారు.
నిఖిల్ కత్తిని తిప్పుతుండగా..సూపర్ డెడికేషన్ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.నిఖిల్ స్వయంభు సినిమా కోసం వియత్నాంలో నెలరోజులు స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. అక్కడ ఆయుధాలు, మార్షల్ ఆర్ట్స్ మరియు గుర్రపు స్వారీలో శిక్షణ తీసుకోనున్నట్టు తెలుస్తోంది. సైగాన్లోని కొంతమంది బిగ్గెస్ట్ స్టంట్ మాస్టర్లు యాక్షన్ సీక్వెన్స్‌ల కోసం నిఖిల్‌కి ట్రైనింగ్ ఇవ్వనున్నారు. ఈ చిత్రంలో తను ఒక వారియర్ గా కనిపించడం కోసం ఫిజికల్‌గా కూడా మేకోవర్ అవుతున్నాడు హీరో నిఖిల్…నిఖిల్ నటిస్తున్న స్వయంభూ చిత్రం అతని కెరీర్ లో 20వ చిత్రంగా తెరకెక్కుతుంది..ఈ సినిమాలో నిఖిల్ సరసన సంయుక్త మీనన్ హీరోయిన్గా నటిస్తుంది.ఈ మూవీకి భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్నాడు. ఠాగూర్ మధు సమర్పణలో పిక్సెల్ స్టూడియోస్ పతాకంపై భువన్, శ్రీకర్ ఎంతో గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. కేజిఫ్ సినిమాకు మ్యూజిక్ అందించిన రవి బస్రూర్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు.
Also Read
- Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో మరో అద్భుత ఘట్టం.. కనులపండువగా లక్ష్మీనృసింహుడి కల్యాణం
- Rahul Gandhi: ఎన్నికల బహిష్కరణపై రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు!
- CM Revanth Reddy : రాష్ట్ర హక్కుల కోసం రాజీలేని పోరాటం.. కేసీఆర్, హరీష్‌పై సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
- Bangladesh: భారత్ నుంచే చుక్కలు చూపిస్తున్న హసీనా.. బంగ్లాదేశ్‌లో లాక్డౌన్!
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో మరో అద్భుత ఘట్టం.. కనులపండువగా లక్ష్మీనృసింహుడి కల్యాణం
-
Rahul Gandhi: ఎన్నికల బహిష్కరణపై రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు!
-
‘RAPO23’ లో ఊహించని ట్విస్ట్ ఇదేనట! విలన్‌గా ఆ సీనియర్ స్టార్?
-
TG SAFE: హైదరాబాద్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారుల కొరడా.. కరాచీ బేకరీ సహా పలు మాంస విక్రయ కేంద్రాలపై మెరుపు దాడులు!
-
CM Revanth Reddy : రాష్ట్ర హక్కుల కోసం రాజీలేని పోరాటం.. కేసీఆర్, హరీష్‌పై సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
ట్రెండింగ్
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో భారత్‌లోకి రానున్న VinFast VF5 ఫేస్‌లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!